Tata Tiago NRG: టాటా టియాగో లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నయా వెర్షన్‌లో అదిరే ఫీచర్స్

|

Mar 14, 2025 | 12:51 PM

భారత ఆటోమొబైల్ రంగంలో అప్‌డేట్స్ ఫీవర్ నడస్తుంది. చాలా కంపెనీలు మార్చి నుంచి తమ మోడల్స్ కార్లు, బైక్‌లను 2025 వెర్షన్‌ను అప్‌డేట్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. ఇదే బాటలో టాటా కంపెనీ కూడా తన టియాగో కారును ఎన్ఆర్‌జీ పేరుతో అప్‌డేట్ చేసింది. సరికొత్త ఫీచర్స్‌తో పాటు ఆకర్షణీయ రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో టాటా టియాగో ఎన్ఆర్‌జీ వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Tata Tiago NRG: టాటా టియాగో లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నయా వెర్షన్‌లో అదిరే ఫీచర్స్
Tata Tiago Nrg
Follow us on

టాటా టియాగో ఎన్ఆర్‌జీ కారును కొత్త ఫీచర్లు, స్టైలింగ్ అప్‌డేట్స్, కొత్త ట్రాన్స్ మిషన్ ఎంపికను తీసుకువచ్చింది. 2025 టాటా టియాగో ఆన్ఆర్‌జీ ధర ఇప్పుడు రూ.7.2 లక్షల నుంచి రూ.8.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారు టాప్-స్పెక్ ఎక్స్‌జెడ్ ట్రిమ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఎంట్రీ- లెవల్ ఎక్స్‌టీ ట్రిమ్ 2025 టియాగో వెర్షన్‌లో అందుబాటులో ఉండదు. కొత్త టియాగో ఎన్ఆర్‌జీ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌తో ఆకర్షణీయ సీఎన్‌జీ-ఏఎంటీ ఎంపికతో వస్తుంది. 2025 టాటా టియాగో ఎన్ఆర్‌జీ నూతన స్టైలింగ్ అప్‌డేట్స్‌తో వస్తుంది. కొత్త మ్యాట్ బ్లాక్ క్లాడింగ్‌తో  పునఃరూపకల్పన చేసిన బంపర్, ముందు, వెనుక భాగంలో మందమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. 15 అంగుళాల స్టీల్ వీల్స్ వేర్వేరు కవర్లతో వస్తున్నాయి. టాటా టియాగో ఎన్ఆర్‌జీ మరింత దృఢంగా కనిపించేలా నల్లటి క్లాడింగ్‌తో వస్తుంది. 

టాటా టియాగో ఎన్ఆర్‌జీ క్యాబిన్ విషయానికి వస్తే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన పెద్ద 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఆకట్టుకుంటుంది. అలాగే రివర్స్ కెమెరా, ఆటో హెడ్ల్యాంప్, వైపర్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటివి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. స్టాండర్డ్ టియాగోతో పోలిస్తే టియాగో ఎన్ఆర్‌జీ సీట్లు, డోర్ ప్యాడ్లు, డాష్‌బోర్డ్‌తో సహా పూర్తిగా బ్లాక్ క్యాబిన్‌తో వస్తుంది. ఆకర్షణీయ టాటా లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఆకట్టుకుంటుంది. 

టాటా టియాగో ఎన్ఆర్‌జీకి 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ యూనిట్‌తో జత చేసిన 84.8 బీహెచ్‌పీ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ శక్తినిస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ 71 బీహెచ్‌పీను ఉత్పత్తి చేయడానికి డిట్యూన్ చేశారు. 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ యూనిట్‌తో జత చేసి వస్తుంది. సీఎన్‌జీ-ఏఎంటీ మోడల్స్‌లో పూర్తిగా కొత్త ఎంపికగా ఉంటుంది. గత సంవత్సరం టియాగో సీఎన్‌జీలో ప్రవేశ పెట్టారు. అప్‌డేటెడ్  టాటా టియాగో ఎన్ఆర్‌జీ మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి