AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simple OneS EV Scooter: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. సూపర్ ఈవీతో ముందుకొచ్చిన సింపుల్ ఎనర్జీ

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు తమ హవా చూపుతున్నాయి. భారతదేశంలో కూడా ఈవీల వృద్ధి ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు టూవీలర్ ఈవీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా కంపెనీలు ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సింపుల్ ఎనర్జీ ఈవీ కంపెనీ మరో సరికొత్త ఈవీతో మన ముందుకు వచ్చింది.

Simple OneS EV Scooter: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. సూపర్ ఈవీతో ముందుకొచ్చిన సింపుల్ ఎనర్జీ
Simple Ones
Nikhil
|

Updated on: Mar 14, 2025 | 2:48 PM

Share

సింపుల్ ఎనర్జీ భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వన్ ఎస్ అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1,39,999గా ఉంది. సింపుల్ వన్ ఎస్ స్కూటర్ గతంలో నిలిపేసిన డాట్ వన్ కంటే రూ.6,217 ఎక్కువగా ఉంది. ఈ కొత్త స్కూటర్ బెంగళూరు, గోవా, పూణే, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కొచ్చి, మంగళూరులోని 15 సింపుల్ ఎనర్జీ షోరూమ్‌లలో వన్స్ అందుబాటులో ఉంటుంది. సింపుల్ వన్స్ ఆవిష్కరణ సందర్భంగా సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింపుల్ ఎనర్జీ తక్కువ ధరలో అధునాతన ఫీచర్స్‌తో సింపుల్ వన్‌ఎస్‌ను ప్రారంభించామని తెలిపారు. ముఖ్యంగా ఈవీ రంగంలో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్స్‌తో స్కూటర్ల లాంచ్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

సింపుల్ వన్ ఎస్ కూడా సింపుల్ వన్ మాదిరిగానే డిజైన్ ఉంటుంది. ముఖ్యంగా కర్వ్‌డ్ హెడ్‌లైట్, అధునాతన బాడీ ప్యానెల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. స్పోర్టీ డిజైన్ ఆకర్షణీయమైన డైనమిక్ లుక్‌ను ఇస్తుంది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ వన్ ఎస్‌ను బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ, నమ్మా రెడ్ అనే నాలుగు రంగు ఎంపికల్లో లభిస్తుంది.  ఫీచర్ల విషయానికి వస్తే సింపుల్ వన్ఎస్‌లో  ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు పర్సనలైజ్డ్ థీమ్‌లు, యాప్ ఇంటిగ్రేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, రైడర్ సౌలభ్యాన్ని పెంచడంతో సహా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ను అందించే ఎంబెడెడ్ 5-జి సిమ్ కూడా ఉంది. 

సింపుల్ వన్‌ఎస్‌లో ఫైండ్ మై వెహికల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రీజెనరేటివ్, రాపిడ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు, రివర్స్, ఫ్రంట్ మూమెంట్ పార్క్ అసిస్ట్ ఫంక్షన్ ఉన్నాయి. వన్‌ఎస్‌ను డాట్ వన్ కంటే సింపుల్ ఒక ముఖ్యమైన స్టెప్-అప్ అని పేర్కొంది.  వన్ ఎస్ స్కూటర్ 3.7 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి ఛార్జ్ చేస్తే 181 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. అవుట్‌గోయింగ్ డాట్ వన్ కంటే 21 కి.మీ ఎక్కువ. బ్యాటరీ 8.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, రైడ్, డాష్, సోనిక్ రైడ్ మోడ్స్‌తో దూసుకుపోవచ్చు. వన్ ఎస్ సోనిక్ మోడ్‌లో 105 కి.మీ.ల గరిష్ట వేగాన్ని, 40 కి.మీల వేగాన్ని 2.5 సెకన్లలో అందుకోగలదు. 

ఇవి కూడా చదవండి

గత నెలలో కంపెనీ సింపుల్ వన్ జెన్ 1.5 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ఇది 248 కి.మీ విస్తరించిన ఐడీసీ పరిధితో వస్తుంది. జెన్-1కు సంబంధించి 212 కి.మీ పరిధి కంటే ఇది ఎక్కువ. సింపుల్ ఎనర్జీ కంపెనీ 150 కొత్త షాపులు, 200 సేవా కేంద్రాలతో 23 రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!