Senior Citizens Investment: సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త.. ఆ మూడు పథకాల్లో పెట్టుబడితో పన్ను బాదుడు నుంచి రక్షణ

పన్ను రహిత పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు వివరిస్తున్నాయి. ముఖ్యంగా 60 నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్న వారు పెట్టుబడి సమయంలో పరిగణించాల్సిన ప్రత్యేక పెట్టుబడి అవసరాలు, అవకాశాలు, పన్నురహిత మార్గాలను తెలుసుకోవాలి. అయితే ఆర్థిక రంగ నిపుణులు మాత్రం సీనియర్‌ సిటిజన్లు, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లు ఓ మూడు పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడితో పాటు పన్ను బాదుడు నుంచి కూడా రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు.

Senior Citizens Investment: సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త.. ఆ మూడు పథకాల్లో పెట్టుబడితో పన్ను బాదుడు నుంచి రక్షణ
Senior Citizen

Updated on: Oct 20, 2023 | 5:30 PM

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ. అందువల్ల భారతదేశంలో మెజార్టీ పెట్టుబడిదారులు ధీర్ఘకాలిక పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పదవీ విరమణ సమయంలో అధిక మొత్తం సొమ్ము చేతికందేలా వివిధ పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. పదవీ విరమణ చేసిన స్థిరత్వంతో కూడిన వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టి నెలవారీ రాబడిని పొందాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆర్థికరంగ నిపుణులు ఈ తరహా పథకాలే మంచివని పేర్కొంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో రాబడిని పొందేటప్పుడు కచ్చితంగా పన్ను బాదుడు ఉంటుందని చాలా మందికి తెలియదు. అయితే అప్పటికే నెలవారీ ఆదాయం తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి పన్ను రహిత పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు వివరిస్తున్నాయి. ముఖ్యంగా 60 నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్న వారు పెట్టుబడి సమయంలో పరిగణించాల్సిన ప్రత్యేక పెట్టుబడి అవసరాలు, అవకాశాలు, పన్నురహిత మార్గాలను తెలుసుకోవాలి. అయితే ఆర్థిక రంగ నిపుణులు మాత్రం సీనియర్‌ సిటిజన్లు, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లు ఓ మూడు పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడితో పాటు పన్ను బాదుడు నుంచి కూడా రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి ఆర్థిక రంగ నిపుణులు సూచించే ఆ పెట్టుబడి పథకాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ పథకంలో పెట్టుబడి మంచి రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో రూ. 30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం సాధారణ ఆదాయం కోసం అన్వేషించే వారికి ఆకర్షణీయ ఎంపిక. ఈ పథకంలో వార్షిక వడ్డీ 8 శాతంగా ఉంటుంది. పైగా ఈ పథకంలో వచ్చిన ఆదాయం ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు 80 సీ కింద మినహాయింపునకు అర్హత ఉంటుంది. అయితే వడ్డీ రాబడిపై మాత్రమే పన్ను విధించినా అది తిరిగి మనం క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే సీనియర్‌ సిటిజన్లు బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా సెక్షన్‌ 80 సీ కిందకు వస్తాయి. అందువల్ల ఈ పెట్టుబడులపై సంవత్సరానికి రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా సీనియర్‌ సిటిజన్లు ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు ఇతర సేవింగ్స్‌ బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీల నుంచి వచ్చే ఆదాయంపై రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు థ్రెషోల్డ్‌ నుంచి ప్రయోజనం పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

వైద్య బీమా పాలసీలు

పెట్టుబడులతో పాటు వయస్సురీత్యా వచ్చే అనారోగ్యాలకు ఖర్చు పెట్టే సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను సెక్షన్‌ 80 డీ కింద సీనియర్‌ సిటిజన్ల వైద్య ఖర్చులు లేదా ఆరోగ్య బీమా ప్రీమియంలపై ఖర్చు పెట్టిన సొమ్ముపై పన్ను మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ మినహాయింపుల వార్షిక థ్రెషోల్డ్‌ రూ.50 వేలు ఉంటుంది. అలాగే సెక్షన్‌ 80 డీడీబీ కింద పేర్కొన్న వ్యక్తులకు వైద్య ఖర్చులపై మినహాయింపునిస్తూ రూ. 1 లక్ష వరకూ తగ్గింపులను మంజూరు చేస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..