FD Interest Rates: సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త.. ఆ బ్యాంకుల్లో ఫిక్స్డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే వడ్డీ

బ్యాంకులు కూడా ఇలాంటి వారిని ఆకట్టుకునేలా సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీను ఆఫర్‌ చేస్తూ ఉంటాయి. గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీనిచ్చాయి. అయితే గత మూడు త్రైమాసికాల నుంచి మాత్రం ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో వడ్డీ పెంపునకు బ్రేక్‌ పడింది. అయినా కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. తాజాగా కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీను ఆఫర్‌ చేస్తున్నాయి.

FD Interest Rates: సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త.. ఆ బ్యాంకుల్లో ఫిక్స్డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే వడ్డీ
Senior Citizen

Edited By:

Updated on: Oct 15, 2023 | 7:09 PM

భారతదేశ జనాభాలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ. నెలంతా కష్టపడి జీతంతో బతికేవాళ్లు భవిష్యత్‌ కోసం వివిధ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా పదవీ విరమణ ప్రణాళిక కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం నుంచి రిటైరయ్యాక వేరే వారిపై ఆధారపడకుండా మన బతుకు మనం బతుకుదామనే ఉద్దేశంతో పదవీ విరమణ సమయానికి అధిక మొత్తంలో సొమ్ము చేతికందేలా వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అనుకున్నట్లుగా పదవీ విరమణ సమయానికి అధిక మొత్తంలో సొమ్ము చేతికందగానే నెలనెలా మంచి రాబడినిచ్చేలా ఫిక్స్డ్‌ డిపాజిట్ల పథకాల్లో పెట్టుబడి పెట్టి నెలవారీ వచ్చే వడ్డీతో హాయిగా బతుకుదామనే ఉద్దేశంతో ఉంటారు. అంతే కాదు మనం పెట్టిన పెట్టుబడి సొమ్ము కూడా ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉంటుందని చాలా మంది పేర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా ఇలాంటి వారిని ఆకట్టుకునేలా సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీను ఆఫర్‌ చేస్తూ ఉంటాయి. గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీనిచ్చాయి. అయితే గత మూడు త్రైమాసికాల నుంచి మాత్రం ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో వడ్డీ పెంపునకు బ్రేక్‌ పడింది. అయినా కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. తాజాగా కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీను ఆఫర్‌ చేస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటి? ఎంత మేర వడ్డీను ఆఫర్‌ చేస్తున్నాయి? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రూ. 2 కోట్ల కంటే తక్కు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో 701 రోజుల ఎఫ్‌డీపై సీనియర్‌ సిటిజన్లకు ఏకంగా 9.45 శాతం వడ్డీను పొందవచ్చని ప్రకటించింది. అలాగే 1001 రోజులకు 9.50 శాతం వడ్డీను పొందవచ్చని బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో వివరించింది. 501 రోజుల కాలవ్యవధిపై 9.25 శాతం వడ్డీను పొందవచ్చు. 

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. దాదాపు ఎఫ్‌డీలపై 125 బేస్‌ పాయింట్లను పెంచింది. అంటే 1.25 శాతం వడ్డీలను పెంచినట్లయ్యింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో సీనియర్‌ సిటిజన్లు 200-400 రోజుల ఫిక్స్డ్‌ డిపాజిట్లల్లో పెట్టుబడి పెడితే  7.5 శాతం వడ్డీను పొందవచ్చు. అలాగే 46 -90 రోజుల స్వల్ప వ్యవధిలో పెట్టుబడి పెడితే 6.25 శాతం వడ్డీను పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..