South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..104 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..

|

Mar 20, 2022 | 6:07 AM

South Central Railway: భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా రైల్వే ప్రయాణికులకు

South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..104 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
Follow us on

South Central Railway: భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా రైల్వే ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే కరోనా కాలంలో నిలిపివేసిన సేవలన్నింటిని ఒక్కొక్కటిగా మళ్లీ ప్రారంభిస్తూ వస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారి సౌకర్యార్థం 104 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకులం-సికింద్రాబాద్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను, మచిలీపట్నం-కర్నూల్ సిటీ-మచిలీపట్నం మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

సికింద్రాబాద్-ఎర్నాకులం-సికింద్రాబాద్ (వీక్లీ స్పెషల్‌ ట్రైన్స్‌): ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్పెట్టాయ్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాల్గాట్‌, త్రిస్సూర్, ఆలువ స్టేషన్లలో ఆగుతుంది.

మచిలీపట్నం-కర్నూల్ సిటీ-మచిలీపట్నం (ట్రై వీక్లీ స్పెషల్‌ ట్రైన్స్): ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపూర్‌ రోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, డోన్‌ స్టేషన్లలో ఆగుతుంది.

South Central Railway

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

Buying Car: ఇవి తెలుసుకోకుండా కారు కొనకండి.. చాలా నష్టపోతారు..!