Bajaj Pulsar: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆకట్టుకుంటున్న నయా వెర్షన్ పల్సర్ బైక్స్..!

భారతీయ వినియోగదారుల కోసం పల్సర్ 125, 150, 220 ఎఫ్‌ మోడల్స్ సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్లను రిలీజ్ చేసింది. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు అనేక అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్స్ లాంచ్ చేసింది. ముఖ్యంగా అప్‌డేటెడ్ బైక్స్ విజువల్ అప్పీల్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. అంతే కాకుండా బజాజ్ పల్సర్ ఎన్ 160ను వీటితో పాటు రిలీజ్ చేసింది.

Bajaj Pulsar: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆకట్టుకుంటున్న నయా వెర్షన్ పల్సర్ బైక్స్..!
Pulsar N160
Follow us
Srinu

|

Updated on: Jun 20, 2024 | 3:45 PM

భారతదేశంలో బజాజ్ కంపెనీకు చెందిన పల్సర్ బైక్స్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. చాలా ఏళ్లుగా పల్సర్ బైక్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్‌లో విక్రయిస్తున్న పల్సర్ మోడల్ లైనపు నవీకరించే పనిలో ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ వినియోగదారుల కోసం పల్సర్ 125, 150, 220 ఎఫ్‌ మోడల్స్ సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్లను రిలీజ్ చేసింది. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు అనేక అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్స్ లాంచ్ చేసింది. ముఖ్యంగా అప్‌డేటెడ్ బైక్స్ విజువల్ అప్పీల్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. అంతే కాకుండా బజాజ్ పల్సర్ ఎన్ 160ను వీటితో పాటు రిలీజ్ చేసింది. ఈ బైక్‌ను రూ. 1.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో పల్సర్ నయా వెర్షన్ బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

పల్సర్ 125 యొక్క కార్బన్ ఫైబర్ సింగిల్, సిట్ సీట్ వేరియంట్లు బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతిచ్చే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జర్‌తో అప్‌డేట్ చేశారు. అలాగే పల్సర్ 150 వేరియంట్లలో ఇలాంటి మార్పులను చేశారు. ఈ నవీకరణల తర్వాత పల్సర్ 125 కార్బన్ ఫైబర్ సింగిల్-సీట్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 92,883 (ఎక్స్-షోరూమ్) వద్ద విక్రయిస్తున్నారు. అలాగే పల్సర్ 150 సింగిల్ డిస్క్ రూ. 1.13 లక్షలు (ఎక్స్-షోరూమ్), పల్సర్ 220 ఎఫ్ ధర రూ. 1.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ధరలను నిర్ణయించింది. 

బజాజ్ పల్సర్ ఎన్ 160 వెర్షన్ విషయానికి వస్తే ఈ  బైక్ ఇతర వేరియంట్లతో పాటు విక్రయిస్తున్నారు. అయితే ఈ బైక్‌లో కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నియంత్రించే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. అదనంగా రైడర్లు రైడింగ్ సౌకర్యవంతంగా చేయడానికి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాి. ఈ బైక్‌లో తాజా షాంపైన్ గోల్డ్ 33 ఎంఎం యూఎస్‌డీ ఫోర్క్లు ఆకట్టుకుంటాన్నాయి. అలాగే ఏబీఎస్ రైడ్ మోడ్ల వల్ల వర్షం వచ్చిన సమయంలో, రోడ్, ఆఫ్-రోడ్ ప్రాంతాల్లో ప్రత్యేక రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఈ బైక్ 164.82 సీసీ ఆయిల్- కూల్డ్ ఇంజన్‌తో 15.78 బీహెచ్‌పీ శక్తిని, 14.65 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి