Fixed Deposits: పెట్టుబడిదారులకు ఆ బ్యాంకుల శుభవార్త… ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఆఫర్‌

|

Jul 12, 2023 | 6:00 PM

ఆదాయాన్ని నిలబెట్టుకోవడానకి కచ్చితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి పథకాల వైపు మొగ్గు చూపుతారు. అయితే బ్యాంకులు కూడా ఇలాంటి వారిని ఆకర్షించడానికి వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తూ ఉంటారు. రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ఫిక్స్డ్‌ డిపాజిట్లపై వడ్డీ గణనీయంగా పెరుగుతుంది. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెరుగుదలకు బ్రేక్‌ పడింది.

Fixed Deposits: పెట్టుబడిదారులకు ఆ బ్యాంకుల శుభవార్త… ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఆఫర్‌
Fixed Deposit
Follow us on

కష్టపడి సంపాదించిన సొమ్మును మంచి రాబడి కోసం వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా మధ్య వయస్సు వారితో పోలిస్తే రిటైరైన వాళ్లు ఎక్కువగా ఇలాంటి పథకాల కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారు జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు పదవీ విరమణ సొమ్ము కూడా చేతికి వస్తుంది. అలాగే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఆదాయాన్ని నిలబెట్టుకోవడానకి కచ్చితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి పథకాల వైపు మొగ్గు చూపుతారు. అయితే బ్యాంకులు కూడా ఇలాంటి వారిని ఆకర్షించడానికి వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తూ ఉంటారు. రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ఫిక్స్డ్‌ డిపాజిట్లపై వడ్డీ గణనీయంగా పెరుగుతుంది. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెరుగుదలకు బ్రేక్‌ పడింది. అయితే బ్యాంకులు ఇంకా కస్టమర్లను ప్రోత్సహించడానికి వడ్డీ రేట్లపై గణనీయమైన రాబడి ఇస్తున్నాయి. ఈ కోవలో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కొంత ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి సీనియర్‌ సిటిజన్లకు ఏయే బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ఈక్విటా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 889 రోజుల నుంచి 1095 రోజుల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎనిమిది శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే పదవీ కాలంలో మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

ఫిన్‌ కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 1001 నుంచి 1095 రోజుల మధ్య మెచ్యూరయ్యే డిపాజిట్లకు 8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే సీనియర్‌ సిటిజన్లకు అయితే 8.6 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 

ఈ బ్యాంక్‌ 1000 నుంచి 1500 రోజుల మధ్య మెచ్యురయ్యే డిపాజిట్లకు 8.25 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే సీనియర్‌ సిటిజన్లకు అయితే 8.85 శాతం వరకూ అధిక వడ్డీని అందిస్తుంది. 

సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పెట్టుబడిదారులకు అధి వడ్డీని ఆఫర్‌ చేస్తుంది. ముఖ్యంగా రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య మెచ్యురయ్యే డిపాజిట్లపై 8.6 శాతం వడ్డీ రేటను అందిస్తుంది. అయితే ఇదే డిపాజిట్‌ సమయానికి సీనియర్‌ సిటిజన్లకు అయితే ఏకంగా 9.1 శాతం వడ్డీ అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం