FD Rates Differences: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. వీటిల్లో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేస్తే అధిక లాభాలు

| Edited By: Ravi Kiran

Jul 16, 2023 | 9:59 PM

గత రెండు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచడంతో వడ్డీల పెంపునుకు బ్రేక్‌ పడింది. అయినా కొన్ని బ్యాంకుల కస్టమర్లను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లను ఇంకా పెంచుతూనే ఉన్నాయి. అయితే కస్టమర్లను మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులు,  సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐతో పాటు, పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లు వంటి చిన్న పొదుపు పథకాలు అధిక వడ్డీని ఇస్తున్నాయి.

FD Rates Differences: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. వీటిల్లో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేస్తే అధిక లాభాలు
Fixed Deposit
Follow us on

ఫిక్స్‌డ్‌  డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా చాలా మంది భావిస్తారు. అయితే గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ఫిక్స్డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు అన్ని బ్యాంకులు విపరీతంగా పెంచాయి. కానీ గత రెండు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచడంతో వడ్డీల పెంపునుకు బ్రేక్‌ పడింది. అయినా కొన్ని బ్యాంకుల కస్టమర్లను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లను ఇంకా పెంచుతూనే ఉన్నాయి. అయితే కస్టమర్లను మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులు,  సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐతో పాటు, పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లు వంటి చిన్న పొదుపు పథకాలు అధిక వడ్డీని ఇస్తున్నాయి. అలాగే ఫిక్స్డ్‌ డిపాజిటర్లు ఆదాయపు పన్ను మినహాయింపులను కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, ఈ మినహాయింపులు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి.కాబట్టి తక్కువ-రిస్క్ ఉన్న ఈ పథకాల్లో పెట్టుబడిపై ఎంత వడ్డీ వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం. 

ఎస్‌బీఐ ఫిక్స్డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు

ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధికి ఎస్‌బీఐలో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేస్తే సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ అందుతుంది. అలాగే ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) అదనంగా పొందుతారు. భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. అలాగే రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఈ రేట్లు 15 ఫిబ్రవరి 2023 నుండి అమల్లోకి వచ్చాయి. 

వడ్డీ రేట్లు ఇలా

  • ఏడు రోజుల నుంచి 45 రోజులు   3 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు  4.5 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజులు – 5.25 శాతం 
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ – 5.75 శాతం
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ – 6.8 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ – 7.00 శాతం
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ – 6.5 శాతం
  • 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు – 6.5 శాతం
  • 400 రోజులుఅమృత్ కలష్‌ డిపాజిట్‌- 7.10 శాతం

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకాలు బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే ఉంటాయి. పోస్ట్ ఆఫీసులు ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్లను అందిస్తాయి. రివిజన్‌తో  కలిపి పోస్టాఫీసుల్లో ఒక సంవత్సరం కాల వ్యవధి డిపాజిట్ ఇప్పుడు 6.9 శాతంగా ఉంది. అలాగే రెండు సంవత్సరాల కాలవ్యవధికి  7 శాతం సంపాదిస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేట్లు వరుసగా 7 శాతం నుంచి 7.5 శాతంగా ఉన్నాయి. ఈ తాజా వడ్డీ రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. 

ఇవి కూడా చదవండి
  • పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం)- 6.9 శాతం
  • పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు)- 7 శాతం
  • పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు)-7 శాతం
  • పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు)-7.5 శాతం

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం