Bank Of India: గృహ రుణాలు తీసుకునే వారికి ఆ బ్యాంక్ శుభవార్త.. భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు
ఇల్లు కొనాలనే కలను సాధించాలనుకునే వారి కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కీలక చర్యలు తీసుకుంది. బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేటును ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 0.15 శాతం వడ్డీ రేటును తగ్గిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం 8.45 శాతం ఉన్న వడ్డీ రేటును ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రతి వ్యక్తికి జీవితంలో సొంతిల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద మైలురాయిగా ఉంటుంది. ఇల్లు కొనాలనే కలను సాధించాలనుకునే వారి కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కీలక చర్యలు తీసుకుంది. బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేటును ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 0.15 శాతం వడ్డీ రేటును తగ్గిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం 8.45 శాతం ఉన్న వడ్డీ రేటును ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ తగ్గింపు నిర్ణయం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ తగ్గింపును గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్యాంకు ఆఫ్ ఇండియా అందించే గృహ రుణాల పథకం ఈ నెలాఖరు వరకు అమలులో ఉంటుంది. అలాగే ఈ బ్యాంకు తాజాగా ప్రాసెసింగ్ రుసుములు కూడా మాఫీ చేస్తుంది. ముఖ్యంగా ఇతర బ్యాంకులకు పోటీనిచ్చేలా 8.3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకుల్లో కనీస రేటు 8.4 శాతంగా ఉంది.
సోలార్ ప్యానెల్స్‌పై ఆఫర్లు
రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు 7 శాతం ప్రత్యేక వడ్డీ రేటు సౌకర్యాన్ని కూడా అందిస్తున్నామని, ప్రాసెసింగ్ రుసుమును కూడా మినహాయిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తులు గరిష్టంగా 120 నెలల రీపేమెంట్ వ్యవధితో ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతం వరకు ఫైనాన్స్ పొందవచ్చు. అలాగే రుణ ప్యాకేజీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంతో కూడా వస్తుంది. బ్యాంకు ఆఫ్ ఇండియా గృహ కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన, సమగ్రమైన ఆర్థిక సహాయ వ్యవస్థను అందిస్తుంది. గృహ నిర్మాణం, పునర్నిర్మాణం మరియు ఫర్నిచర్ ఖర్చులను కవర్ చేయడంతో పాటు హోమ్ లోన్ ఆఫర్ సంప్రదాయ ఫైనాన్సింగ్‌కు మించి దాని పరిధిని విస్తరించింది. గృహ రుణాలకు వర్తించే అదే వడ్డీ రేటుతో రూ. 10 లక్షల వరకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




