FD Interest Rates : ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ బ్యాంకుల్లో భారీ వడ్డీ అందజేత

|

Mar 31, 2023 | 3:30 PM

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో సంచిత రేటు పెంపు 250 బేసిస్ పాయింట్లు పెంచింది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు మరియు చిన్న ప్రైవేట్ బ్యాంకులు మూడు సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్‌డీలకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.

FD Interest Rates : ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ బ్యాంకుల్లో భారీ వడ్డీ అందజేత
Fixed Deposit
Follow us on

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్ల పెంపుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఆరోసా రెపో రేటు పెంచిన తర్వాత పెట్టుబడి కాల వ్యవధిలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో సంచిత రేటు పెంపు 250 బేసిస్ పాయింట్లు పెంచింది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు మరియు చిన్న ప్రైవేట్ బ్యాంకులు మూడు సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్‌డీలకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేటు పెంపు విషయంలో వెనుకబడి ఉన్నాయి. ఆర్థిక నిపుణుల వెల్లడించిన వివరాల ప్రకారం టాప్ 10 బ్యాంకులు దాదాపు 7.6 శాతం వడ్డీని అందిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీని అందిస్తుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. మూడేళ్ల వరకు పెట్టుబడులపై ఈ రేటు వర్తిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ.1.27 లక్షలకు పెరుగుతుంది.

ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

విదేశీ బ్యాంకుల్లో డ్యుయిష్ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది మూడేళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీని అందిస్తుంది. అదేవిధంగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మూడేళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీని అందిస్తాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల ఎఫ్‌డీల్లో రూ.లక్ష పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ. 1.26 లక్షలకు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

డీసీబీ బ్యాంక్ 

డీసీబీ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలపై 7.60 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.25 లక్షలకు పెరుగుతుంది.

యూనియన్ బ్యాంక్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఇది 7.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది.

7.25 శాతం ఇచ్చే బ్యాంకులు ఇవే

బంధన్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం