
బంగారం, వెండి ధరలు గత మూడ్రోజులుగా పెరుగుతున్నాయి. గతంలో తగ్గగా.. మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. పసిడి ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, మార్పులతో కొనుగోలుదారులు అమోమయంతో ఉన్నారు. ఇక డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారు ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో పునరాలోచనలో పడ్డారు. అయితే బంగారం, వెండితో పాటు యుద్దం ప్రభావం కారణంగా మరో లోమం ధరలు కూడా పెరిగుతున్నాయి. అదే రాగి. రాగి ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. ఈ నెలలో లాభాల దిశగా అడుగులు వేశాయి. అయితే ఇరాన్ చర్చలకు రావాలని, లేకపోతే మరిన్ని దాడులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదురవుతాయనే కారణంతో రాగి ధరలు పెరిగినట్లు బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.
మధ్యప్రాచర్యానికి మరో 10 వేల మంది బలగాలను పంపించేందుకు అమెరికా సిద్దమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మందగమన పరిస్థితుల క్రమంలో ఈ నెలలో పారిశ్రామిక లోహల ధరలు పెరుగుతున్నాయి. ఇక ఆల్యూమినియం ధరలు కూడా పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ప్రపంచ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ఆల్యూమినియం కోసం జపాప్ కొనుగోదారులు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. ఇక చైనాలో రాగికి డిమాండ్ పెరుగుతోంది. అక్కడ నుంచి ఆర్డర్లు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. దీంతో రాగికి డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నాయి. లండన్ మెటల్ ఎక్సైంజ్ ప్రకారం టన్నుకు 0.7 శాతం పెరిగి 12,227 డాలర్లకు రాగి చేరుకుంది. ఈ వారంలో ఏకంగా 2.5 శాతం పెరిగింది.