Gold Price Today: అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Slips Again: బంగారం కొనే వారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం తరువాత ఈ ఆభరణాల ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. కాబట్టి బుధవారంతో పోల్చుకుంటే గురువారం ఉదయం 6 గంటల తెలుగురాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Rate Dropped

Updated on: Jun 25, 2026 | 6:29 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్నాళ్లుగా ఆల్‌టైం రికార్డుకు చేరి పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు కాస్త శాంతిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా గత 4 రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం మరోసారి ఈ ఆభరణాల ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. బుధవారం ఉదయం 6గంటల నుంచి గురువారం ఉదయం 6 వరకు చూసుకుంటే.. 24 క్యారట్ల తులం బంగారంపై రూ.250 వరకు దిగొచ్చింది.

గురువారం 6గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా 

ఇక ప్రస్తుతం జాతీయ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,44,320 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,290గా ఉంది. ఇక 18 క్యారట్ల బంగారం ధర రూ. 1,08,240 వద్ద ట్రేడవుతుంది. అలాగే వెండి ధరలు చూసుకుంటే జాతీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,44,900 కొనసాగుతుంది..

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,290గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,470, 22 క్యారెట్ల ధర రూ.1,32,440 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల ధర రూ.1,32,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.145,630, 22 క్యారెట్ల ధర రూ.1,33,490 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,320, 22 క్యారెట్ల ధర రూ.1,32,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 లుగా ఉంది.

FAQs- బంగారం కొనే ముందు కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి

  • ప్రశ్న: బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయా?

  • జవాబు: అంతర్జాతీయ శాంతి పరిస్థితులు, డాలర్ బలాన్ని బట్టి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

  • ప్రశ్న: 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారానికి తేడా ఏమిటి?

  • జవాబు: 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం (నాణేలు/బిస్కెట్లు) అయితే, 22 క్యారెట్ ఆభరణాల తయారీకి వాడే బంగారం.

  • ప్రశ్న: నగరాల వారీగా బంగారం ధరలలో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?

  • జవాబు: స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు మరియు అక్కడి నగల సంఘాల నిర్ణయాల వల్ల ధరలు మారుతుంటాయి.

  • ప్రశ్న: బంగారం కొనేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఏం చూడాలి?

  • జవాబు: నగపై ప్రభుత్వం గుర్తించిన ‘BIS హాల్‌మార్క్’ ముద్ర, ఆరు అంకెల HUID కోడ్ తప్పక చూసుకోవాలి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us