
Gold Silver Price Today: భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగా పెరిగే బంగారం ధరలు.. గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా అక్టోబర్ 24న రాత్రి సమయానికి బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.650 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,000 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే భారీగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై ఏకంగా 4000 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,55,000 వద్ద కొనసాగుతుంది. ఇటీవల కిలో వెండి ధర రూ.2 లక్షల చేరువలో ఉండేది.
ఇది కూడా చదవండి: Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..!
1.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,000 వద్ద ఉంది.
2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,150 వద్ద ఉంది.
3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,000 వద్ద ఉంది.
తులం బంగారం ధర
రెండు నెలల నిరంతర లాభాల తర్వాత బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గడం ప్రారంభించాయి. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ తగ్గుతున్నాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రెండు విలువైన లోహాలు గణనీయమైన తగ్గుదలను చవిచూశాయి. బంగారం, వెండి రికార్డు గరిష్టాలను చేరుకున్న తర్వాత కూడా ఈ తగ్గుదల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పెరుగుదల ఇప్పుడు ఆగిపోయింది. ఇది పెట్టుబడిదారులకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. డాలర్ బలం, అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా ఈ ధరల తగ్గుదల జరిగిందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: SUV Scooter: భారతదేశపు మొట్టమొదటి SUV స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ఇది కూడా చదవండి: Mukesh Ambani: సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి