Gold Silver Rate Today: మహిళలకు గుడ్‏న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో ఎంత ఉందంటే..

|

Dec 07, 2022 | 6:48 AM

డిసెంబర్ 7న భారీగా తగ్గాయి. ఈరోజు పసిడి ధర గ్రాముకు రూ. 30 ... తులంకు రూ. 300 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం

Gold Silver Rate Today: మహిళలకు గుడ్‏న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో ఎంత ఉందంటే..
Gold And Silver
Follow us on

మహిళలకు.. పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడ్డాయి. ఇటీవల దాదాపు రూ.1000కి పైగా పెరిగిన బంగారం ధర.. డిసెంబర్ 7న భారీగా తగ్గాయి. ఈరోజు పసిడి ధర గ్రాముకు రూ. 30 … తులంకు రూ. 300 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 53, 780గా ఉంది. ఇక హైదరాబాద్‏ తోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని పసిడి ధరలలో మార్పులు వచ్చాయి.

ఇతర నగరాల్లో బంగారం ధరలు..

ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 53,780 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 49,300 కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 53,780.. 10 గ్రాముల 22 క్యారెట్ల రేట్ రూ. 49,300 కు చేరింది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 53,780.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 49,450కు చేరింది. చైన్నై మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 54,650 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ. 50,100 కు చేరింది. విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 53,780 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ. 49,300కు చేరింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలో పయనిస్తుంది. గత రెండు రోజులుగా పరుగులు పెట్టిన సిల్వర్ రేట్స్ ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 100 గ్రాముల సిల్వర్ రేట్స్ రూ. 50 తగ్గింది. దీంతో పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్స్ మారాయి.

ఇవి కూడా చదవండి

సిల్వర్ రేట్స్..

హైదరాబాద్ లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 708కు ఉండగా.. కేజీ వెండి రూ. 70800 చేరింది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 708 ఉండగా.. కేజీ ధర రూ. 70800 కు చేరింది. ముంబై, ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 660 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 66000 కు చేరింది. అలాగే.. కోల్ కత్తా, పూణె ప్రాంతాల్లో 10 గ్రాముల వెండి రూ.660 ఉండగా.. కేజీ రూ. 66000 కు చేరింది. ఇక విజయవాడ , విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 708కు ఉండగా.. కేజీ వెండి రూ. 70800 చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.