Today Gold price: తగ్గిన బంగారం ధర.. నిన్నటితో పోల్చితే ఎంతో తెలుసా.?

|

Aug 26, 2024 | 6:30 AM

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతున్నాయి. సోమవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయంతో పోల్చితే ఈరోజు తులంపై సుమారు రూ. 100 వరకు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,300కి చేరువైంది....

Today Gold price: తగ్గిన బంగారం ధర.. నిన్నటితో పోల్చితే ఎంతో తెలుసా.?
Gold Price Today
Follow us on

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతున్నాయి. సోమవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయంతో పోల్చితే ఈరోజు తులంపై సుమారు రూ. 100 వరకు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,300కి చేరువైంది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,180 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,940, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. సోమవారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 87,900గా ఉండగా.. చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా రూ. 92,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్నిబిజినెస్  వార్తల కోసం క్లిక్ చేయండి..