Gold and Silver Price: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గోల్డ్ ధర గత కొద్దిరోజులుగా పెరుగుదలను నమోదు చేస్తూ.. ఆల్‌టైమ్ రికార్డ్ చేరుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత పది రోజుల్లోనే బంగారం ధరలు దాదాపు 2వేలకు పైగా పెరిగాయి. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటు పెళ్లిళ్ల సీజన్, అటు ఇన్వెస్ట్‌మెంట్ లు భారీగా పెరగడంతో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని జ్యుయెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 17, 2024 ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100.. కిలో వెండిపై రూ.77300 లుగా కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,590, 24 క్యారెట్ల రేట్ రూ.66,100 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,590, 24 క్యారెట్లు రూ.66,100
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,150, 24 క్యారెట్లు రూ.66,710
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,590, 24 క్యారెట్లు రూ.66,100
కేరళలో 22 క్యారెట్ల రేట్ రూ.60,590, 24 క్యారెట్లు రూ.66,100
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ.60,590, 24 క్యారెట్ల రేట్ రూ.66,100
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.60,590, 24 క్యారెట్ల పసిడి రేట్ రూ.66,100 గా ఉంది.