Gold Price: షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఎంతో తెలిస్తే షాకవుతారు!

|

Jul 27, 2024 | 2:48 PM

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 23న దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గింపు తర్వాత ఒక్కసారిగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బడ్జెట్‌ ప్రకటించిన వెంటనే తులం బంగారంపై దాదాపు 4000 రూపాయల వరకు తగ్గింది. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.6000 వరకు తగ్గింది...

Gold Price: షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఎంతో తెలిస్తే షాకవుతారు!
Gold Rates
Follow us on

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 23న దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గింపు తర్వాత ఒక్కసారిగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బడ్జెట్‌ ప్రకటించిన వెంటనే తులం బంగారంపై దాదాపు 4000 రూపాయల వరకు తగ్గింది. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.6000 వరకు తగ్గింది. ఇక వెండి విషయానికొస్తే కిలోపై రూ.10 వేల వరకు తగ్గింది. భారతదేశంలో బడ్జెట్ తర్వాత దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత బంగారం తగ్గుదల వేగం పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.63,000కు పడిపోయింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.69,000 దిగువకు పడిపోయింది.

బంగారం ధర ఎంతకాలం తగ్గుతుందో చెప్పలేం. జూలై చివరలో US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును సవరించింది. అలాగే రేటు తగ్గితే, బంగారం ధర కూడా తగ్గవచ్చు. అంటే భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.61,000 అంటే ఆశ్చర్యం లేదు.

గ్లోబల్ మార్కెట్ పరిశోధకుడు సర్వేంద్ర శ్రీవాస్తవ తెలిపిన ప్రకారం.. బంగారం ప్రియుల్లో మరో షాకింగ్‌ కలుగుతోంది. బంగారం ధర అతి త్వరలో మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోందని అన్నారు. అది కూడా ఏకంగా తులం బంగారంపై రూ.18వేల వరకుపెరిగే అవకాశం ఉందని అంటున్నారు. లండన్ బులియన్ ఎక్స్ఛేంజ్‌లో ధరల హెచ్చుతగ్గులను విశ్లేషించడం ద్వారా ఆయన ఈ అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Indians: భారతీయులు అధికంగా వెళ్లే టాప్ 10 దేశాలు.. వీసా లేకుండా ఏ దేశంలో ఎన్ని రోజులు ఉండొచ్చు!

ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టే సమయం వచ్చింది. మీరు జూలై 31 వరకు వేచి ఉండి, ఆ తర్వాత కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మరో మార్కెట్ నిపుణుడు జతిన్ త్రివేది మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం బంగారంపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బంగారం ధర 72,000 రూపాయలకు చేరుకున్నప్పుడు, బుల్లిష్, బేరిష్ ధరల మధ్య ఘర్షణ ఉండవచ్చు. ధర తగ్గడం ప్రారంభించవచ్చు.

బంగారం, వెండి తదితరాలపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్‌లో తగ్గించారు. అలాగే బంగారంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా తగ్గించారు. దీంతో బంగారంపై ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. ధర తక్కువగా ఉన్నప్పుడు బంగారం కొనడం తెలివైన పని. అయితే శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,000 వద్ద ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.84,500 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి