Gold Price Today: బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..

బంగారం ధరలు కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‏లో మాత్రం గోల్డ్ రేట్స్ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. భారతీయులకు పసిడి అంటే చాలా ఇష్టం. ఇక మహిళలకు బంగారం మీద ఉండే మక్కువ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. మరీ తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసా.. ?

Gold Price Today: బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..
Gold Rate
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2025 | 7:46 AM

కొన్నాళ్లుగా బంగారం ధరలు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా భారతీయులు గౌవరంగా భావించే ఈ పసిడి ధరలు పెళ్లిళ్ల సీజన్ సమయంలో మాత్రం సామాన్యులకు మరింత షాకిస్తున్నారు. తగ్గినట్లే తగ్గి రోజు రోజుకీ మరింత పెరిగుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు పసిడి ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. దీంతో భారతీయ దేశీయ మార్కెట్లో తులం బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఇప్పటికే తులం గోల్డ్ రేట్ రూ.85 వేల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. మరీ ఈరోజు (ఫిబ్రవరి 5న) ఉదయం 7 గంటల సమయంలో పది గ్రాముల గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసుకుందామా. అలాగే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తులం బంగారం ఎంత ధర ఉందో తెలుసుకుందాం.

ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.82,010 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 78,100గా ఉంది. దేశీయ మార్కెట్లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎంత ఉన్నాయో చుద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఈరోజు ఉదయం ఒక్కసారిగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.85,200కు చేరింది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 78,100 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు ప్రాంతాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.85,200 వద్ద కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 78,100 చేరింది.

ఇతర ప్రాంతాల్లో పసిడి ధరలు..

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.84,055గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.77,055కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.84,061గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.77,061కు చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.84,213గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.77,213కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.84,067గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.77,067కు చేరింది. పూణెలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.84,073గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.77,073కు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..