బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుండి పెరుగుతున్న బంగారం ధరల దూకుడు తగ్గడం లేదు. ప్రతిరోజూ పైకి చూస్తున్న బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 250 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 280 రూపాయల మేర బంగారం ధర పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుత సీజన్ పెళ్లిమూహూర్తాలు ఎక్కువగా ఉండటం, శుభకార్యాల నేపథ్యంలో బంగారం కొనుగోలు కూడా భారీగా సాగుతున్నాయి. బంగారం షాపులన్ని మహిళలతో రద్దీగా ఉంటున్నాయి. దేశంలోని పలు మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,370 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,590 వద్ద నమోదైంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.62,130 వద్ద ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.57,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,280 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,130 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130 ఉంది.
హైదరాబాద్‌లో వెండిని కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యుత్తమ వెండి ధరలను అందించగలరు. అయితే, మీరు వ్యాపారి అయినా లేదా ఇన్వెస్టర్ అయినా వెండిలో పెట్టుబడి పెడితే లాభమేనంటున్నారు నిపుణులు. మీరు వెండిలో అనేక మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు వెండిని భౌతిక రూపంలో కొనుగోలు చేయవచ్చు లేదంటే MCX ద్వారా కూడా కొనుగోలు, అమ్మకంపై కూడా పెట్టొచ్చు.
ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,700, ముంబైలో రూ.78,000, ఢిల్లీలో రూ.78,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.78,000, బెంగళూరులో రూ.82,700, హైదరాబాద్‌లో రూ.82,700, విజయవాడలో రూ.82,700 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి