గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెరుగుదలే తప్ప తగ్గడం లేదన్నట్లూ గోల్డ్ రేట్స్ దూసుకుపోయాయి. ఆదివారం తులం బంగారంపై ఏకంగా రూ. 110 వరకు పెరిగి గోల్డ్ లవర్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ ధర ఎప్పుడో రూ. 60 వేలు దాటేసింది. అయితే సోమవారం మాత్రం గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం విశేషం. ఢిల్లీ మొదలు హైదరారాబాద్ వరకు గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే పెద్దగా మార్పు కనిపించ లేదు. మరి దేశంలోని పలు మేజర్ సిటీల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీలో సోమవారం బంగారం ధరలో మార్పు కనిపించలేదు. ఇక్కడ సోమవారం 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,370గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,450, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,490వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధానిలోనూ బంగారం ధరలో మార్పు లేదు. ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,200 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,220గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్స్ ధర రూ. 55,200 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 55,200కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది. పుణెలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,200కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,220వద్ద కొనసాగుతోంది. నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ ధర రూ. 55,200కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,220గా ఉంది. ఇక విజయవాడ విషయానికొస్తే.. ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,220వద్ద కొనసాగుతోంది.
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ పెద్దగా మార్పు కనిపించలేదు. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి రూ. 80,000కి చేరింది. ఇక ముంబయిలో మాత్రం కిలో వెండి ధర రూ. 76,900గా ఉండడం గమనార్హం. ఇక ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లో కిలో వెండి ధర రూ. 76,900 వద్ద కొనసాగుతోంది. ఇదిలా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..