Gold and Silver Rate Today: మరోసారి తగ్గిందోచ్.. బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. పసిడి ధరలు మీ నగరంలో ఇలా..
ప్రపంచ మార్కెట్ ప్రభావంతో భారత్ బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇలా దిగిరావడం పసిడి ప్రియులకు శుభవార్తే అని చెప్పాలి.. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఇటీవలి వరకు బంగారం ముట్టుకుంటే ఒట్టేనన్నట్టుండేది.

Gold, Silver Price Today: గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు కొద్ది కొద్దిగా నేలచూపులు చూస్తున్నాయి. ఇలా దిగిరావడం పసిడి ప్రియులకు శుభవార్తే అని చెప్పాలి.. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఇటీవలి వరకు బంగారం ముట్టుకుంటే ఒట్టేనన్నట్టుండేది. ఆరుపదులు దాటి చాలాకాలమే అయ్యింది. పెళ్ళిళ్ళు… పండుగలు…శుభకార్యం ఏదైనా భారతీయుల ఇంట బంగారం ఉండాల్సిందే. గత కొంతకాలంగా ముట్టుకుంటే మండిపోయే స్థితిలో ఉన్న బంగారం ఇప్పుడిప్పుడే నేల చూపులు చూస్తోంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు 1000 రూపాయలు తగ్గింది. మంగళవారం భారత్‌లో బంగారం సామాన్యుడి చేరువగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది. అయితే ఆశాడం మొదలు కావడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. దీంతో మార్కెట్లో బంగారం కొనుగోళ్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇది మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. ఆన్‌లైన్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గోల్డ్ ప్రియులు.
24 క్యారెట్ ధర
- 24 క్యారెట్ స్టాండర్డ్ గోల్డ్ 1 గ్రాము – రూ. 5,873
- 24 క్యారెట్ స్టాండర్డ్ గోల్డ్ 8 గ్రాము – రూ. 46,984
- 24 క్యారెట్ స్టాండర్డ్ గోల్డ్ 10 గ్రాము – రూ. 58,730
22 క్యారెట్ ధర
- 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 1 గ్రాము – రూ. 5,593
- 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 8 గ్రాము – రూ. 44,744
- 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాము – రూ. 55,930
వెండి ధర గురించి మాట్లాడుకుంటే దానిలో కిలోకు దాదాపు రూ. 500 తగ్గింది. నేటి మార్కెట్ ధర ఇలాగే ఉంది.
- 1 గ్రాము వెండి ధర రూ.79
- 1 కిలో వెండి ధర రూ.79,000
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,210గా చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బంగారం ధర మరికొంత తక్కువగా కనిపిస్తోంది. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,070 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,070 వద్ద కొనసాగుతోంది. దక్షిణ భారత దేశం తమిళనాడు రాజధానిలో చెన్నైలో 22 క్యారెట్స్ రూ. 55,400, 24 క్యారెట్స్ ధర రూ.60,440గా వద్ద కొనసాగుతోంది.
ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో.. ఓసారి పరిశీలిద్దాం..
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,070 వరకు చేరింది. తెలంగాణలో మరో ప్రధాన నగరం వరంగల్‌లో 22 క్యారెట్స్ రూ. 55,070, 24 క్యారెట్స్ రూ. 60,070 వద్ద కొనసాగుతోంది.
- ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,070 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,070గా ఉంది. ఏపీలోని మరో బిజినెస్ సెంటర్ విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,070, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 60,070గా ఉంది.
గత మూడు నెలల్లో ఇంత భారీ స్థాయిలో బంగారం ధరలు తగ్గడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం




