Gold Rates: షాకింగ్ న్యూస్.. ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేయనున్న బంగారం ధరలు.. మరీ ఇంతలా..

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును అధిగమించి మరింత పెరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో రికార్డ్ బ్రేక్ చేయనున్నాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో గత కొద్ది నెలలుగా గోల్డ్ రేటులో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

Gold Rates: షాకింగ్ న్యూస్.. ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేయనున్న బంగారం ధరలు.. మరీ ఇంతలా..
Gold Price

Updated on: Dec 01, 2025 | 1:53 PM

India Gold Price: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ధరలకు ఎక్కడా బ్రేక్ అనేది పడటం లేదు. రోజూ ఎంతకొంత పెరుగుతూనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిణామాలతో రేట్లు పెరుగుతూ గోల్డ్ ప్రియులను షాక్‌కు గురి చేస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు తులం బంగారం లక్షన్నరకు చేరుకోగా.. సామాన్య, మధ్యతరగతి జనం షాపుల వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో పెళ్లిళ్ల సీజన్ల సమయంలో కూడా బంగారం షాపులు వెలవెలపోయి దర్శనమిస్తున్నాయి. కస్టమర్లు రాకపోవడంతో బంగారం షాపులకు కూడా డిమాండ్ ఉండటం లేదనే చెప్పుకోవాలి.

ఈ క్రమంలో బంగారం ధరలపై మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. మరికొన్ని వారాల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు నుంచి ఏడు వారాల తర్వాత బంగారం ధరలు మరింత చేయనున్నాయని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం బంగారం ధరలు 3 శాతం పెరిగాయి. ఈ వారం సరికొత్త రికార్డును సృష్టించే అవకాశముందని చెబుతున్నారు. పది గ్రాములకు రూ.5 వేల వరకు పెరగొచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇండియాలో పెళ్లిళ్ల సీజన్‌తో పాటు US సెంట్రల్ బ్యాంక్ త్వరలో వడ్డీ రేటును తగ్గించే అవకాశముంది. ఇక రష్యా, నాటో, ఉక్రెయిన్ మధ్య వివాదం ముదురుతోంది. ఈ కారణాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సంవత్సరంలో బంగారం ధరలు 60 శాతం పెరిగాయి. అక్టోబర్ 17న దేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.ఈ వారంలో మరింత గరిష్ట స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉందని బిజినెస్ వర్గాలు అంచనా కడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే బంగారం ప్రియులకు షాక్‌గా చెప్పుకోవచ్చు.

నేడు స్థిరంగా బంగారం ధరలు

నేడు బంగారం ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,810 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,990 వద్ద ఉంది.