
Gold Price: బంగారం ధరలను చూస్తే ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజురోజుకు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు రూ.90 వేల వరకు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు ఏకంగా లక్షా దాటేసింది. పది గ్రాములకు రూ. 99,500 నుండి రూ. 110,000 వరకు ట్రేడవుతుందని, 2026 ప్రథమార్థంలో రూ. 110,000 నుండి రూ. 125,000 వరకు పెరుగుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధన నోట్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Amazon Great Indian Festival: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త.. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ తేదీని ప్రకటించిన అమెజాన్
‘మా అంచనాల కంటే అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి భారీగా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయినట్లయితే అంచనాలకు మించి ముప్పు మరింతగా ఉండే అవకాశం ప్రమాదం ఉంది. ఈ కాలానికి డాలర్‌తో రూపాయి మారక విలువ సగటున 87.00 – 89.00 మధ్య ఉంటుందని అంచనా వేశాం’ అని నివేదిక పేర్కొంది.
2025లో ఇప్పటివరకు ప్రపంచ బంగారం ధరలు దాదాపు 33 శాతం పెరిగాయని నివేదిక హైలైట్ చేస్తుంది. దీనికి US ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య సడలింపు అంచనాలు, యూఎస్ ఆర్థిక వ్యవస్థపై నిరంతర సంస్థాగత ఆందోళనలు మద్దతు ఇస్తున్నాయి. 2025 మిగిలిన కాలంలో ప్రపంచ బులియన్ ఔన్సుకు సగటున USD 3,400-3,600 ఉంటుందని, 2026 మొదటి అర్ధభాగంలో ఔన్సుకు USD 3,600-3,800కు మరింత బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. వీటిపై భారీ డిస్కౌంట్లు
ఇది కూడా చదవండి: Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి