Gold Price Falling : రోజురోజుకీ దిగివస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు పసిడిపై పెట్టుబడులు పెట్టవచ్చా..?

భారతీయ సంప్రదాయంలో బంగారం వెండి అలంకారం కోసమే కాదు.. అవసరానికి ఉపయోగపడే ఓ ఆర్ధిక వనరు కూడా.. ఇక ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం లో పసిడి...

Gold Price Falling : రోజురోజుకీ దిగివస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు పసిడిపై పెట్టుబడులు పెట్టవచ్చా..?
Gold Prices Down
Follow us

|

Updated on: Mar 26, 2021 | 4:57 PM

Gold Price Falling : భారతీయ సంప్రదాయంలో బంగారం వెండి అలంకారం కోసమే కాదు.. అవసరానికి ఉపయోగపడే ఓ ఆర్ధిక వనరు కూడా.. ఇక ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం లో పసిడి ప్రత్యామ్నాయ పెట్టుబడిగా మారింది. పెట్టుబడికి రాబడినిచ్చే అన్ని మ్యూచువల్ ఫండ్స్ విలువ పడిపోయినా బంగారం ధరలు మాత్రం గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి.. దీంతో గోల్డ్ పై పెట్టుబడులు పెట్టవచ్చా..? లేదా అనే ప్రశ్న ముదుపర్లలో మొదలైంది.

గత ఏడాదిలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న బంగారం ధరలు మెల్లగా దిగి వచ్చాయి.. దీనికి చాలా కారణాలున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నుంచి దేశీయ కొనుగోళ్ల వరకూ బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. ఓ వైపు డాలర్ బలపడడం.. మరోవైపు కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థలు క్రమంగా కోలుకోవడం కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలు పెట్టాక దాదాపు 20 శాతం వరకూ పసిడి ధర తగ్గింది. ఇక ముదుపరులు ఈక్విటీ, డెట్‌, మ్యూచువల్‌ ఫండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

అయితే బంగారం పై పెట్టుబడి పెట్టాలనుకునే ముదుపర్లకు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. అనే విషయం పై పూర్తి అవగాహన ఉంటె మంచిది. ఇక వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు కూడా దృష్టిలో పెట్టుకుని గోల్డ్ పై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. బంగారం ధరలను డాలర్ విలువ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, చమురు ధరలు వంటివి ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి బంగారం ధరల్లో చాలా కాలం ఎటువంటి మార్పు ఉండదు.. ఒకొక్కసారి హఠాత్తుగా పెరుగుతుంది. అందుల్లనే పసిడి వాస్తవిక విలువకు మార్కెట్‌ ధరలకు సంబంధం ఉందని తెలుస్తోంది. అందుకనే పసిడి పై పెట్టుబడి పెట్టేవారు మార్కెట్ పరిష్టితులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సి ఉంది. అదృష్టాన్ని నమ్ముకుని కాకుండా.. మార్కెట్ పై పూర్తి అవగాహన ఉన్నవారు బంగారం పై పెట్టుబడి పెడితే మంచిది. ఇక పసిడి ని కొనేబదులు.. మార్కెట్ లో ఉండే పసిడి బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటివి కొనుగోలు చేస్తే మంచిది. ఇందులో మదుపు చేస్తే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

బంగారం పై భారీగా లాభాలొస్తున్నాయని అత్యాశతో ఒక్కసారే మొత్తం పెట్టుబడిని పసిడిలో పెట్టడం మంచిది కాదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.,. ఎప్పుడు భారీగా తగ్గుతాయో అంచనా వేయడం కష్టమని.. ఉన్న మొత్తాన్ని బంగారం పై భారీగా పెడితే.. ఒక్కసారిగా బంగారం ధర పతనమైతే.. ఆ నష్టాన్ని భరించడం కష్టమని అంటున్నారు.అందుకనే మూదుపర్లు తమ భవిష్యత్ ను అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5-15 శాతం వరకు పసిడి పై పెట్టుబడులకు కేటాయించవచ్చని ఆర్ధిక నిపుణులు తెలిపారు.

Also Read: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా .. నటి అవ్వడానికి ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో తెలుసా..!

నేషనల్ అవార్డ్ చేజిక్కించుకున్న కంగన రనౌత్.. నాలుగుసార్లు జాతీయ పురస్కారం ఆమె సొంతం

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన