Gold And Silver Price Today: బంగారం ప్రియులకు నిజంగా శుభపరిణామమే.. ఏకంగా రూ. 11,393 తగ్గిన బంగారం ధర..!

Gold And Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. పసిడి ధరలు రోజు రోజుకు పడిపోతూనే..

Gold And Silver Price Today: బంగారం ప్రియులకు నిజంగా శుభపరిణామమే.. ఏకంగా రూ. 11,393 తగ్గిన బంగారం ధర..!
Gold Rates
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 24, 2021 | 5:22 AM

Gold And Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. పసిడి ధరలు రోజు రోజుకు పడిపోతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలో తగ్గుదల కొనసాగింది. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 170 తగ్గింది. దాంతో ప్రస్తుతం పది గ్రాముల గోల్డ్ రూ. 48,050 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 150 తగ్గి.. రూ. 44,050 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పుత్తడి ధరలు దేశంలోని మిగతా ప్రాంతాలకంటే తక్కువగానే ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 44,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 43,000 గా ఉంది. ఇక తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భాగ్యనగరంలో పది గ్రాముు మేలిమి బంగారం ధర రూ. 45,700 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900 వద్ద ట్రేట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 45,700 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 41,900 పలుకుతోంది.

ఇదిలాఉంటే.. గతేడాది ఆగస్టులో పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 56 వేల పైచిలుకు పెరిగింది. పెరుగుతున్న బంగారం ధరలు చూసి జనాలు బెంబేలెత్తిపోయారు. అయితే, కరోనా వ్యాక్సిన్ రావడం, మార్కెట్‌లో బంగారం డిమాండ్‌ తగ్గడంతో గత అక్టోబర్ నెల నుంచి పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడూ పెరిగినా.. పెద్దగా మార్పు ఏం కనిపించలేదు. మొత్తంగా గరిష్ట ధర నమోదైన ఆగస్టుతో పోలిస్తే.. మార్చి ధరకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. దాదాపు రూ. 11,393 మేరకు గోల్డ్ ధర పడిపోయింది. అయితే, దేశీయంగా బంగారం ధరలు పడిపోవడానికి డిమాండ్ తగ్గడమే కారణమని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆ కారణంగానే పసిడి దిగుమతులు కూడా గణనీయంగా పడిపోతున్నాయని అంటున్నారు. బంగారం, వెండిపై దేశ ప్రజలకు మోజు తగ్గుతోందని, ఫలితంగా డిమాండ్ కూడా తగ్గుతోందన్నారు.

ఇక వెండి ధరలు మాత్రం బంగారానికి వ్యతిరేకంగా పయనిస్తున్నాయి. తాజాగా వెండి కిలో ధర రూ. 400 మేర పెరిగింది. ప్రస్తుతం వెండి ధర ఢిల్లీ మార్కెట్‌లో రూ. 66,331 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో హైదరాబాద్ కేజీ వెండి ధర రూ. 70,400 పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కిలో వెండి రేట్ రూ. 70,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also read:

Novak Djokovic: నొవాక్ జొకోవిచ్‌పై భారీ కుట్ర.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సెర్బియన్ మోడల్ నటాలియా..

Government of India: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఏప్రిల్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దు.. ప్రకటించిన కేంద్ర ప్రభుతవం..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం