Government of India: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఏప్రిల్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దు.. ప్రకటించిన కేంద్ర ప్రభుతవం..
Aviation Restrictions: అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ విమాన..
Aviation Restrictions: అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణలపై ఉన్న నిషేధాన్ని మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ పేరిట ప్రకటన విడుదల చేశారు. 26-06-2020 నాడు జారీ చేసిన సర్క్యూలర్‌లో సవరణ చేయడం జరిగిందని, అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న నిషేధం ఏప్రిల్ 30, 2021 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత దేశానికి వచ్చే, పోయే విమాన ప్రయాణాలపై ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, డీజీసీఏ ప్రత్యేక అనుమతితో నడిచే అన్ని అంతర్జాతీయ కార్గో కార్యకాలు, ఇతర విమాన ప్రయాణలపై మాత్రం ఈ సర్క్యూలర్ వర్తించదన్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం నడిచే అంతర్జాతీయ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో సంబంధిత అనుమతుల ద్వారా నడుపొచ్చని కేంద్రం విమానయాన శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రయాణికులు సహకరించాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని విమానయాన శాఖ విజ్ఞప్తి చేసింది.
ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది మే నెలలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను రద్దు చేస్తూ ప్రకనటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ఈ ఆంక్షలను సడలించినప్పటికీ.. మళ్లీ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాప్తి ఉధృతం అవడంతో.. కేంద్రం అప్రమత్తం అయ్యింది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ముందుగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత పౌర విమానాయశాఖ జాయింట్ డైరెక్టర్ సునీల్ కుమార్ పేరిట అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలంటూ ఎయిర్‌లైన్స్ సంస్థలకు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు, దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నిర్వాహకులకు, ఇమ్మిగ్రేషన్ బ్యూరో కమిషనర్‌కు ఈ నోటీసులను పంపించారు.
Also read:
OU – JNTU Exams: ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ పరీక్షలు యధాతథం.. నోటిపికేషన్ విడుదల..