Gold Price Today: షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ పరుగులు.. 10 గ్రాముల ధర ఎంతంటే!

|

Jan 27, 2022 | 5:43 AM

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో విలువ ఉంది. ముఖ్యంగా మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత..

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ పరుగులు.. 10 గ్రాముల ధర ఎంతంటే!
Follow us on

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో విలువ ఉంది. ముఖ్యంగా మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక పెళ్లి సీజన్‌ వచ్చిందంటే చాలు జ్యూలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక గురువారం (జనవరి 27)న దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,830 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910 ఉంది.

బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చోటు చేసుకుంటుండటం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణమనే చెప్పాలి. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ఎస్‌బీఐలో ఎలా తెరవాలి..?

Axis Bank Profit: లాభాల బాటలో యాక్సిస్ బ్యాంకు.. మూడవ త్రైమాసికంలో మూడు రేట్లు పెరిగిన ఆదాయం