Gold Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా పసిడి రేట్ల వివరాలు

|

Jan 13, 2022 | 5:57 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది...

Gold Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా పసిడి రేట్ల వివరాలు
Follow us on

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. బంగారం ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపుల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. దేశంలో బంగారం ధరల్లో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో పెరిగితే.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగానూ, స్థిరంగా ఉంటాయి. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (జనవరి 13)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు మరింతగా పెరిగాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు. తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 వద్ద ఉంది.

► ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,940 వద్ద కొనసాగుతోంది.

► ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010 ఉంది.

► ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.

► అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.

► అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం మార్పులు చేర్పులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక రకాల కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

ITR Extention: ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..!

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు..!