Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ధరలు..

|

Aug 10, 2021 | 6:27 AM

Gold Rates Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు సంభవిస్తుంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక రోజు ధరలు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ధరలు..
Gold Price Today
Follow us on

Gold Rates Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు సంభవిస్తుంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక రోజు ధరలు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తర్వాత స్వల్పంగా దిగివస్తున్నాయి. అందుకే పసిడి ప్రియులు బంగారం ధరల వైపు దృష్టిసారిస్తుంటారు. తాజాగా పసిడి ధరలు తగ్గాయి. దేశీయంగా పరిశీలిస్తే.. మంగళవారం 10 గ్రాముల ధరపై దాదాపు రూ.410 వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,280 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,280 గా ఉంది. అయితే.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280గా ఉంది.

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600లుగా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780గా ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది.

Also Read:

Pinky Karmakar: అప్పటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు తేయాకు తోటల్లో దినసరి కూలీ!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఖాతాలో కొత్త శత్రువు.. ఈయన చాలా స్పెషల్ గురూ!