
Gold price today on April 24th 2021: బంగారం ధర తగ్గింది. పసిడి వెల వెలబోయింది. బంగారం ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అలాగే పసిడి కోనాలనుకుంటున్నవారికి ఇది మంచి ఛాన్స్. కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తుండడంతో.. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఒకనొక దశలో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరుగుదలను నమోదుచేసుకున్నాయి. ఇక నిన్నటితో పోల్చుకుంటే.. శనివారం ఉదయం బంగారం ధరలు నెల వైపు చూస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.45,060కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,060కు చేరింది. ఇక అటు దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్స్ లో మార్పులు జరిగాయి.
దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,360 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,580కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,800 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది. ఇక ముంబై మార్కెట్లో సైతం బంగారం ధరలలో మార్పులు జరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,060 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,060 ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 44,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,040 గా ఉంది.