Gold Price Today: దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్వల్పంగా పెరిగింది

|

Jun 27, 2021 | 6:43 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం ప్రియులకు ధరలు షాకిచ్చాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు..

Gold Price Today: దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్వల్పంగా పెరిగింది
Gold Price Today
Follow us on

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం ప్రియులకు ధరలు షాకిచ్చాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా ఆదివారం దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.200 వరకు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రధాన నగరాల్లో రూ.100 మాత్రమే పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

కాగా, బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు.. స్థిరమైన లాభం వస్తుంది అనే అంచనాకు రాలేకపోతున్నారు. ఆ మధ్య రూ.50వేల మార్కును దాటిన బంగారం రూ.60వేలకు చేరుతుందనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు నష్టపోయారు. బంగారం ధర రెండు వారాలుగా తగ్గిపోతూ వచ్చింది. దాంతో ఇన్వెస్టర్లు నష్టం మరింత పెరగకుండా జాగ్రత్తపడి తమ పెట్టుడిని వెనక్కి తీసుకున్నారు.

అయితే ఆదివారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

AC: మీరు కొత్త ఏసీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? నెలకు రూ.1749 కడితే చాలు.. ఏసీ మీ సొంతం

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన సిల్వర్‌.. ప్రధాన నగరాల్లో ధరలు వివరాలు..!