Gold and Silver Price Today: అంతర్జాతీయంగా పసిడికి భారీ డిమాండ్ ఉంటుంది. వివాహాలు, ఏమైనా శుభకార్యాలున్నా బంగారం, వెండిని చాలామంది కొంటుంటారు. అంతేకాకుండా డబ్బులున్నా కానీ, బంగారం కొని దాచుకుంటుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే, మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా, బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర (తులం) రూ.54,150 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,060 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.72,200 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,060 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,150, 24 క్యారెట్లు 59,060గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లు 54,300, 24 క్యారెట్లు 59,220 ఉండగా, ముంబైలో 22 క్యారెట్లు 54,150, 24 క్యారెట్లు 59,060, చెన్నైలో 22 క్యారెట్లు 54,600, 24 క్యారెట్లు 59,560 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,800 లుగా ఉంది. ముంబైలో 72,200, ఢిల్లీలో 72,200, బెంగళూరులో రూ.71,750, హైదరాబాద్ లో రూ.75,800, విజయవాడలో రూ.75,800 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు గురువారం ఉదయం వరకు నమోదైనవి.. కాగా.. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..