
బంగారం కొనాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. రోజు రోజుకీ పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతుంది. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ వస్తున్న బంగారం ధరలు.. తగ్గుతాయనుకుంటే ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాల సమయానికి భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్ తగ్గుతుందేమోనని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఈరోజు పసిడి ధరలు మరింత పెరగడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో సైతం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,630గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.73,910వద్ద కొనసాగుతుంది. నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 80,620 ఉన్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్…
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,630 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,910కి చేరింది.
ఇక విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 80,630 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,910కి చేరింది. అటు విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
పలు ప్రధాన నగరాల్లో ధరలు..
దేశీయ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,780 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.74,060గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 80,630 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,910గా వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నై, కోల్ కత్తా, బెంగుళూరు, కేరళ, పూణెలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,680 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.74,960గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి