Gold Price Today: వారెవ్వా.! గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఒక్క రోజులోనే భారీగా తగ్గిన ధర

|

Nov 13, 2024 | 7:51 AM

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై గట్టిగానే పడింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి బంగారం ఏకంగా రూ. 4,140 మేరకు తగ్గింది. గత రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ రూ. 2 వేల వరకు తగ్గడం గమనార్హం.

Gold Price Today: వారెవ్వా.! గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఒక్క రోజులోనే భారీగా తగ్గిన ధర
Gold Prices
Follow us on

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై గట్టిగానే పడింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి బంగారం ఏకంగా రూ. 4,140 మేరకు తగ్గింది. గత రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ రూ. 2 వేల వరకు తగ్గడం గమనార్హం. ఈ ధరల తగ్గుముఖం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని బిజినెస్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకానొక దిశలో బంగారం ధర రూ. 60 వేలు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఇక మంగళవారంతో పోలిస్తే ఇవాళ నమోదైన గోల్డ్ రేట్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌ నుంచి నెగిటివ్ సంకేతాలు, అంతర్జాతీయంగా బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ70,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,430 దగ్గర కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,280 దగ్గర కొనసాగుతోంది.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,280 దగ్గర కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,280 దగ్గర కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,280 దగ్గర కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,280 దగ్గర కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

వెండి ధరల్లోనూ..

వెండి ధరలు కూడా గత రెండు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో కేజీ వెండి ఏకంగా రూ. 3100 మేరకు తగ్గింది. నిన్నటితో పోలిస్తే బుధవారం కూడా కిలో వెండి రూ. 100 మేరకు తగ్గగా.. ప్రస్తుతం దేశంలో వెండి రూ. 90,900 దగ్గర కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులో కేజీ వెండి రూ. 90,900 దగ్గర ఉండగా.. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి లక్షకు దిగువకొచ్చింది. ప్రస్తుతం రూ. 99,900 దగ్గర కొనసాగుతోంది.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..