Gold Price Today: గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతుందంటే

బంగారం ధరలు తగ్గుతున్నాయ్. నవంబర్ నెల మొదటిలో గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ ఇస్తూ.. ధరలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ పెరగగా.. ఇప్పుడు రెండు రోజుల నుంచి స్వల్పంగా బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్‌లో తులం బంగారం ఎలా ఉందంటే..

Gold Price Today: గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతుందంటే
Gold Rates

Updated on: Nov 11, 2024 | 7:39 AM

మగువలకు గుడ్‌న్యూస్. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనాలనుకుంటున్నవారికి ఇది అద్దిరిపోయే న్యూస్. బంగారం ధరలు దిగివచ్చాయ్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో.. యూఎస్ డాలర్ ఇండెక్స్ భారీగా పెరిగింది. దీని వల్లే బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 4 నెలల గరిష్టానికి డాలర్ ధర చేరడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఇదే దేశీయంగానూ కనిపిస్తోంది. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 మేరకు తగ్గింది. సోమవారం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,890 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,500గా ఉంది.

ఇవి కూడా చదవండి

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,740 కాగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,350గా ఉంది.

బెంగళూరు, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72, 740 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,350గా కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లు తులం బంగారం ధర రూ. 72,740 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,350గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

వెండి ధరలు..

వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో స్థిరంగా కొనసాగిన వెండి ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కేజీపై రూ. 100 మేరకు తగ్గింది. పూణేలో కేజీ వెండి ధర రూ. 93,900 కాగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కూడా ఇదే ధర ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్, కేరళలో కేజీ వెండి రూ. 1,02,900 దగ్గర ఉంది.

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..