Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే.?

|

Nov 03, 2024 | 7:11 AM

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. దీపావళి పండుగ తర్వాత నుంచి గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి మీరు కూడా ఈ సమయంలో బంగారం కొనాలనుకుంటున్నారా.? అయితే హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతుందో చూసేయండి..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే.?
Follow us on

వరుస రెండు రోజుల నుంచి గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. దీపావళికి ముందు భారీగా పెరుగుతూపోయిన బంగారం ధరలకు.. పండగ పూర్తికాగానే ఒక్కసారిగా బ్రేక్ పడింది. నవంబర్ నెల మొదటి రోజున భారీగా తగ్గిన బంగారం ధర.. ఆ తర్వాతి రోజున రూ. 150 మేరకు తగ్గింది. ఇక ఆదివారం మళ్లీ స్వల్పంగా తగ్గి శాంతించింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి నిల్వలు.. అలాగే గ్లోబల్ మార్కెట్‌లోని అనిశ్చితలు.. దేశీయంగా ధరలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మరి ఆదివారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,800 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,550 దగ్గర ఉంది.

ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ.73,700 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,400 దగ్గర ఉంది.

ఇవి కూడా చదవండి

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,700 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,400 దగ్గర ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,700 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,400 దగ్గర ఉంది.

వెండి ధరలు ఇలా..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. గడిచిన మూడు రోజులుగా వెండి ధరల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. అయితే నవంబర్ నెల మొదటి రోజు మాత్రం ఏకంగా కిలో వెండి రూ. 3 వేల మేరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. లక్షా 6 వేలు ఉండగా.. ఢిల్లీలో రూ. 97,000, ముంబైలో రూ. 97,000, బెంగళూరులో రూ. 97,000, చెన్నైలో రూ. 1,06,00గా కొనసాగుతోంది. కాగా, ఈ బంగారం ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..