Gold Price Today: దేశీయంగా బంగారానికి మహిళలు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్ల వ్యాపారం జోరుగానే కొనసాగుతూ ఉంటుంది. ఇక తాజాగా ఆదివారం (జనవరి 16) బంగారం ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయంగా ధరలు పరిశీలిస్తే 10 గ్రాములపై స్వల్పంగా పెరిగింది. అయితే చాలా ప్రాంతాల్లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో బంగారం ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు. కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,080 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,080 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.
► మధురైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 ఉంది.
బులియన్ మార్కెట్లో పసిడి ధరలలో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా బంగారం కొనుగోళ్లపై ప్లాస్ చేసుకోవడం మంచిది. ఒక రోజు ధరలు భారీగా తగ్గితే.. మరో రోజు భారీగా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: