Personal vs Gold Loan: పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ మధ్య ఏది మంచిదో తెలుసా.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ..

|

Nov 08, 2022 | 9:44 AM

బ్యాంకులు, బ్యాకింగేత‌ర‌ ఆర్థిక సంస్థలు లేదా తెలిసిన‌ స్నేహితులు, బంధువుల నుంచి అవ‌స‌రానికి అప్పు తీసుకుని.. ఆ తర్వాత డ‌బ్బు చేతికి అందిన వెంట‌నే తిరిగి చెల్లింస్తుంటాం. కొన్నిసార్లు జీవితంలో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా..

Personal vs Gold Loan: పర్సనల్ లోన్,  గోల్డ్ లోన్ మధ్య ఏది మంచిదో తెలుసా.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ..
Personal Vs Gold Loan
Follow us on

ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు మనం లోన్లు తీసుకుంటూ ఉంటాం. బ్యాంకులు, బ్యాకింగేత‌ర‌ ఆర్థిక సంస్థలు లేదా తెలిసిన‌ స్నేహితులు, బంధువుల నుంచి అవ‌స‌రానికి అప్పు తీసుకుని.. ఆ తర్వాత డ‌బ్బు చేతికి అందిన వెంట‌నే తిరిగి చెల్లింస్తుంటాం. కొన్నిసార్లు జీవితంలో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా డబ్బు అవసరమయ్యే సమయం వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ప్రజలు ఇప్పుడు అత్యవసర నిధిని పొందడానికి వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. వీటిలో వ్యక్తిగత రుణం, బంగారు రుణం తీసుకుంటారు. అయితే  వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఏదైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ రుణాల సహాయం కూడా తీసుకుంటున్నారు. కానీ, పర్సనల్ లోన్, బంగారం రెండింటిలో ఏ ఎంపికను ఎంచుకోవాలో చాలా సార్లు గందరగోళానికి గురవుతారు. కాబట్టి ఈ రోజు రెండు లోన్‌ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవల్సిన అవసరం ఉంది. అప్పుడు మీరు మీ గందరగోళాన్ని క్లియర్ చేయవచ్చు. దీని గురించి తెలుసుకోండి..

  1. ఈ లోన్‌కు మరిన్ని డాక్యుమెంట్‌లు అవసరం. వ్యక్తిగత రుణంలో మీరు మీ ఆస్తులలో దేనినీ తనఖా పెట్టనవసరం లేదు. అయితే గోల్డ్ లోన్‌లో మాత్రం మీరు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందుతారు. మీరు పర్సనల్ లోన్‌లో చాలా డాక్యుమెంట్‌లను సమర్పించాలి. ఇందులో ఆదాయ రుజువు, ఐడీ ప్రూఫ్ వంటి అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు, గోల్డ్ లోన్‌లో బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టడం ద్వారా మీరు సులభంగా లోన్ పొందవచ్చు.
  2.  ప్రాసెసింగ్ ఫీజులో కూడా తేడా ఉంటుంది. పర్సనల్ లోన్‌లో మీ మొత్తం నేపథ్యాన్ని తనిఖీ చేస్తుంది. దీని కారణంగా పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంపెనీలు లేదా బ్యాంకులు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు వ్యక్తిగత రుణాలలో అధిక ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తాయి. మరోవైపు, మీరు గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు మీ బంగారాన్ని తాకట్టు పెడతారు. ఈ సందర్భంలో మీరు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  3. గోల్డ్ లోన్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఈ రోజుల్లో బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు కస్టమర్లకు గోల్డ్ లోన్‌లు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. దీనికి అతిపెద్ద కారణం ఇది సురక్షిత రుణంగా పరిగణించబడుతుంది. కస్టమర్ రుణం డబ్బును తిరిగి ఇవ్వకపోతే.. అటువంటి పరిస్థితిలో కంపెనీ లేదా బ్యాంకు అతని బంగారాన్ని విక్రయించి అతని డబ్బును తిరిగి పొందవచ్చు. దీని కారణంగా, వీలైనంత త్వరగా ఆమోదం పొందుతుంది.
  4. గోల్డ్ లోన్ రీపేమెంట్ సులభం పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్‌ని తిరిగి చెల్లించడం సులభం .ఇందులో, మీరు అనేక రకాల రీపేమెంట్ ఆప్షన్‌లను పొందుతారు. మీరు ఈ రుణాన్ని నెమ్మదిగా తిరిగి చెల్లించవచ్చు.
  5. వడ్డీ రేటు వ్యత్యాసం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బ్యాంకులు చాలా తక్కువ వడ్డీ రేట్లలో బంగారు రుణాలను అందిస్తాయి. వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ లోన్ సెక్యూర్డ్ లోన్ కావడమే దీనికి అతిపెద్ద కారణం. దీని వల్ల తక్కువ వడ్డీ లభిస్తుంది. పర్సనల్ లోన్ అనేది అసురక్షిత రుణం. ఈ కారణంగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇందులో అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం