Gold Rates: బంగారం ప్రియులకు సూపర్ న్యూస్.. ఆ దేశంలో చవక ధరకే బంగారం.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం బంగారం రేట్లు ఆమాతంగా పెరుగుతున్నాయి. లక్షన్నరకు బంగారం ధరలు చేరుకోగా.. త్వరలో 2 లక్షలకు కూాడా చేరువ కానుందనే అభిప్రాయాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో తక్కువ ధరకే బంగారం లభిస్తే.. ఎవరికైనా పండుగే కదా.. అవును.. ఆ దేశంలో తక్కువ ధరలకే బంగారం విక్రయిస్తున్నారు.

Gold Rates: బంగారం ప్రియులకు సూపర్ న్యూస్..  ఆ దేశంలో చవక ధరకే బంగారం.. కారణం ఏంటంటే..?
Gold Bhutan

Updated on: Nov 27, 2025 | 4:55 PM

Gold Price: ఇండియాలో బంగారంపై ప్రజలకు ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లి అయినా.. పండుగ అయినా ముందుగా బంగారం గురించే మదిలో ఆలోచన ఉంటుంది. ఈ సమయాల్లో ఎలాంటి బంగారం ధరిస్తే బాగుంటుందనేది ఆలోచిస్తూ ఉంటారు. ఇక మహిళలు అయితే గోల్డ్‌ను ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే కాకుండా భారత ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిలా భావిస్తారు. భవిషత్తు అవసరాల కోసం బంగారాన్ని కొని దాచుకుంటారు. ఆపత్కార సమయంలో ఆ బంగారాన్ని అమ్ముకుని తమ అవసరాలకు వినియోగించుకుంటారు. ఇక డబ్బులు అత్యవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంట్లో బంగారం ఉండటం వల్ల మనకు ఆర్ధిక భరోసా ఉంటుంది.

ప్రస్తుతం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న ఆర్ధిక పరిణామాలతో బంగారంపై పెట్టుబడి పెట్టడాన్ని ఇన్వెస్టర్లు సురక్షితంగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా తప్ప తగ్గడం లేదు. కొన్ని రోజులు ఆగితే రూ.2 లక్షల మార్క్‌ను కూడా బంగారం తాకే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో బంగారం తక్కువ ధరకు వస్తే.. అవును.. ఆ దేశంలో బంగారం తక్కువ ధరకే లభిస్తుంది. ఆ దేశం ఏదో కాదు.. భూటాన్.

భూటాన్‌లో చవకకే బంగారం వస్తుంది. దానికి కారణం ఆ దేశం బంగారం దిగుమతులపై తక్కువ సుంకం విధించడమే. దిగుమతులపైనే కాకుండా అమ్మకాలపై కూడా ఆ దేశంలో ట్యాక్స్ లేదు. భూటాన్‌కు వెళ్లే పర్యాటకులు కూడా ట్యాక్స్ లేకుండా అక్కడ బంగారం కొనుగోలు చేయొచ్చు. దేశంలో బంగారం అమ్మకాలను పెంచడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల భూటాన్ వెళ్లినవారు అక్కడ బంగారం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.  ఆ తర్వాత దుబాయ్, హాంకాంగ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా బంగారం తక్కువ ధరకు లభిస్తుంది.

Follow Us