AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Tax: ఇంట్లో ఉన్న బంగారానికి ట్యాక్స్‌ కట్టాలా? నిబంధనలు ఏంటి?

మీరు ప్రకటించిన ఆదాయం, వ్యవసాయ ఆదాయం వంటి పన్ను మినహాయింపు ఆదాయం నుండి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా మీరు దానిని చట్టబద్ధంగా వారసత్వంగా పొందినట్లయితే దానిపై దానిపై ఎలాంటి ట్యాక్స్‌ ఉండదు. మీరు నిర్దేశించిన పరిమితిలోపు బంగారాన్ని నిల్వ చేసినా లేదా పరిమితిని

Gold Tax: ఇంట్లో ఉన్న బంగారానికి ట్యాక్స్‌ కట్టాలా? నిబంధనలు ఏంటి?
Subhash Goud
|

Updated on: Oct 04, 2025 | 9:55 AM

Share

Gold Tax: భారతదేశంలో బంగారాన్ని అలంకరణ కోసం ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడమే కాకుండా, ఇది ఒక ముఖ్యమైన పెట్టుబడి కూడా. ఇంకా వివాహాలు సహా వివిధ సందర్భాలలో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. భారతదేశంలో బంగారం చాలా ప్రజాదరణ పొందింది. ప్రజలు దానిని తరం నుండి తరానికి పోగు చేసుకుంటారు. కానీ ఇంట్లో ఎంత బంగారాన్ని నిల్వ చేయవచ్చో మీకు తెలుసా? నిర్ణయించిన పరిమితి ఏమిటి? ఆదాయపు పన్ను శాఖ మీ బంగారం కొనుగోళ్లను పర్యవేక్షిస్తుందని, నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ కలిగి ఉండటం వలన మీకు నోటీసు జారీ చేయవచ్చు. లేదా ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తారని మీకు తెలుసా? ఆదాయపు పన్ను పరిశీలనను నివారించడానికి మీరు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచవచ్చో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Viral Video: సీటు కోసం గొడవ.. మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు!

నియమాలు అందరికీ భిన్నంగా..

భారతదేశంలో బంగారం కొనుగోలు, నిల్వ చేయడానికి నియమాలు పురుషులు, వివాహిత మహిళలు, అవివాహిత మహిళలకు భిన్నంగా ఉంటాయి. వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండటానికి అనుమతి ఉంది. అవివాహిత మహిళలు 250 గ్రాముల వరకు, పురుషులు100 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

మీరు ఈ పరిమితి కంటే ఎక్కువ బంగారం కలిగి ఉంటే, మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో బిల్లు లేదా డిక్లరేషన్ ఉండాలి. మీ వద్ద చెల్లుబాటు అయ్యే రుజువు ఉంటే మీరు ఎంత బంగారాన్ని అయినా ఉంచుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగ్గా అందుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. పరిమితిలోపు బంగారం ఉంటే ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉండదు.

ఇది కూడా చదవండి: FASTag: మీకు ఫాస్టాగ్‌ లేదా.. మీకో గుడ్‌న్యూస్‌.. కేంద్రం ఊరట..!

బంగారం ఉంటే పన్ను చెల్లించాలా?

మీరు ప్రకటించిన ఆదాయం, వ్యవసాయ ఆదాయం వంటి పన్ను మినహాయింపు ఆదాయం నుండి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా మీరు దానిని చట్టబద్ధంగా వారసత్వంగా పొందినట్లయితే దానిపై దానిపై ఎలాంటి ట్యాక్స్‌ ఉండదు. మీరు నిర్దేశించిన పరిమితిలోపు బంగారాన్ని నిల్వ చేసినా లేదా పరిమితిని మించినా చెల్లుబాటు అయ్యే రుజువు కలిగి ఉన్నా, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు దాడులలో మీ నగలను జప్తు చేయలేరు. ఇంట్లో బంగారాన్ని నిల్వ చేయడంపై ఎటువంటి పన్ను లేదు. కానీ ఎవరైనా బంగారాన్ని అమ్మితే, దానిపై పన్ను విధిస్తారు.

ఇది కూడా చదవండి: Viral Video: దొంగల ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి