Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంత ఉందంటే.?
పసిడి ప్రేమికులకు బ్యాడ్‌న్యూస్.. బంగారం ధర మరోసారి పైకి ఎగబాకింది. భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు..
పసిడి ప్రేమికులకు బ్యాడ్‌న్యూస్.. బంగారం ధర మరోసారి పైకి ఎగబాకింది. భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి 9వ తేదీతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 150 పెరిగి రూ. 52,900 చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 160 పెరిగి రూ. 57, 710గా ఉంది. అయితే పసిడితో పోల్చుకుంటే.. వెండి ధరలు మాత్రం కాస్త దిగివచ్చాయి. మరి దేశంలోని కీలక నగరాలు, హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 050 పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 860 పలుకుతోంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53, 750, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58, 640గా ఉంది. అటు ఆర్ధిక నగరం ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 900గానూ, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57, 710గానూ ఉంది. కోల్‌కతా విషయానికొస్తే.. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్‌పై ముంబైలో నమోదైన ధరలే ఉన్నాయి. బెంగళూరులో అయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 950గా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57, 760గా నమోదైంది.
మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 900గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 710గా నమోదైంది. అటు విశాఖపట్నం, విజయవాడలో ఈ రేట్లే కొనసాగుతున్నాయి. వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 500 తగ్గి.. రూ. 73,500 దగ్గర కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతాలో కేజీ వెండి రూ. 71, 350గా నమోదు కాగా.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో రూ. 73,500 పలుకుతోంది.