AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఆదివారం మే 3న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకోండి..

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: May 03, 2026 | 6:10 AM

Share

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. .ఆ తర్వాత క్రమంగా దిగివస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. అయితే.. ఇటీవల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (మే 3, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,38,350 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,65,000 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,930, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,70,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,50,930, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,51,230, 22 క్యారెట్ల ధర రూ.1,38,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,930, 22 క్యారెట్ల ధర రూ.1,38,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,730, 22 క్యారెట్ల ధర రూ.1,40,000 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,000 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930, 22 క్యారెట్ల ధర రూ.1,38,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us