Today Gold Price: మగువలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

దేశంలో బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక దేశంలో బంగారం ధరలు షాకిచ్చాయి. కొత్త సంవత్సరానికి ముందు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 వరకు ఎగబాకింది.

Today Gold Price: మగువలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై  ఎంత పెరిగిందంటే..
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2023 | 6:26 AM

దేశంలో బంగారం ధరలు షాకిచ్చాయి. కొత్త సంవత్సరానికి ముందు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 వరకు ఎగబాకింది.

దేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం కొనుగోలు జోరుగా సాగుతుంటాయి. ద్రవ్యోల్బణం మొదలైనప్పుడల్లా, ప్రపంచ దేశాల కరెన్సీల విలువ బంగారంతో పోలిస్తే తగ్గుతుంది. అటువంటి సమయాల్లో మీరు బంగారాన్ని తీసుకోవడం ద్వారా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది కాకుండా, బంగారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. మరి డిసెంబర్‌ 27న దేశంలోని ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.64,310 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,860 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
  • ఇక దేశంలో వెండి ధర మాత్రం అతిస్వల్పంగా పెరిగింది. కిలోపై రూ.300 చొప్పున పెరుగగా, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,500 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి