Gold Prices Today: బంగారం ధరలపై మళ్లీ ఊరట.. శాంతించిన ధరలు.. ఆదివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ స్ధాయిలో బంగారం రేట్లు భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ రేట్ల పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మొన్నటివరకు ధరలు పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. ఆదివారం రేట్లు ఇలా..

Gold Prices Today: బంగారం ధరలపై మళ్లీ ఊరట.. శాంతించిన ధరలు.. ఆదివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price

Updated on: Feb 01, 2026 | 6:36 AM

మొన్నటివరకు పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయి. ఆల్ టౌం రికార్డ్ స్థాయికి చేరుకున్న ధరలు.. మళ్లీ కుప్పకూలుతున్నాయి. గత కొద్దిరోజులుగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతుండగా.. ఒక్కసారిగా దిగిరావడం చర్చనీయాంశంగా మారింది. తగ్గడానికి కారణాలు ఏంటనే దానిపై అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇవాళ గోల్డ్ రేట్లు  ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,60,580 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల రేటు రూ.1,47,200 వద్ద ట్రేడవుతోంది.

-ఇక విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,60,580 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,200గా ఉంది.

-ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,625,550 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,49,000గా ఉంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,580 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,200 వద్ద ట్రేడవుతోంది.

-ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,60,730గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,350 వద్ద కొనసాగుతోంది

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

-ఢిల్లీలో కేజీ వెండి రూ.3,50,000 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది

-హైదరాబాద్‌లో కేజి వెండి ధర రూ.3,20,000 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో కేజీ వెండి రూ.3,20,000 వద్ద కొనసాగుతోంది

-బెంగళూరులో కేజీ వెండి రేటు రూ.3,50,000 వద్ద కొనసాగుతోంది