Gold and Silver Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా మంగళవారం దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉండగా, ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,500 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, విజయవాడలో రూ.73,500 వద్ద కొనసాగుతోంది.
అయితే మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు ఇవి. ఇంకా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.