
బంగారం, వెండి లోహాల కొనుగోలుకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుతం బంగారాన్ని ఓ పెట్టుబడిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. దీంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. గత కొన్ని రోజులుగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లిన పసిడి ధరలు.. నిన్న కొంతమేర దిగివచ్చాయి. కానీ, నేడు మరోసారి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం(3వ తేదీ, ఫిబ్రవరి) తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
అంతర్జాతీయంగా బంగారం.. వెండి ధరలు పెరిగడంతో.. దేశీయంగానూ కొంతమేర పెరిగి, వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.
ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర పెరిగి.. రూ.53,600కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.560 మేర పెరిగి.. రూ.57,870 వద్ద కొనసాగుతోంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్‌లో కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,750కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.58,610 వద్ద కొనసాగుతోంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,600 ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 58,470లు ఉంది.
చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 60,050లు ఉంది.
వెండి ధరలు: బంగారం బాటలో వెండి కూడా నడుస్తోంది. రూ. 1400లు పెరిగి ప్రస్తుతం రూ.74,700లకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.77,800 వద్ద కొనసాగుతుంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కొనసాగుతున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,700కు చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..