మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి.. పరుగులు పెడుతున్న ధరలు.. తాజా రేట్ల వివరాలు

మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి.. పరుగులు పెడుతున్న ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold, Silver Price Today: బులియన్‌ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. రెండురోజుల కిందట స్థిరంగా కొనసాగిన పసిడి ధర.. నిన్న కూడా తులం బంగారంపై ..

Subhash Goud

|

May 13, 2022 | 6:19 AM

Gold, Silver Price Today: బులియన్‌ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. రెండురోజుల కిందట స్థిరంగా కొనసాగిన పసిడి ధర.. నిన్న కూడా తులం బంగారంపై రూ.400 వరకు పెరిగింది. దేశంలో ఉక్రెయిన్‌-రష్యా (Ukraine-Russia)దాడుల తర్వాత ఒక్కసారిగా పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఇక తాజాగా మే 13న శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 నుంచి రూ.490 వరకు పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే మీకు అందిస్తున్నాము. రోజులో ధరలు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకోవడం మంచిది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.

☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51,490 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 వద్ద ఉంది.

వెండి ధరలు:

ఇదిలా ఉంటే.. వెండి ధరలు గత నాలుగైదు రోజుల కిందట స్థిరంగా కొనసాగితే.. రెండు రోజుల కిందట దిగి వచ్చింది. ఈ రోజు పెరిగింది. బంగారం బాటలోనే సిల్వర్‌ కూడా పయనిస్తోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, ముంబైలో రూ.60,800 వద్ద ఉంది. ఢిల్లీ కిలో వెండి ధర రూ.60,800 ఉండగా, కోల్‌కతాలో రూ.60,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.65,000 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, విజయవాడలో రూ.65,000 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu