Petrol, Diesel Rates Today: భగ్గుమన్న క్రూడాయిల్‌.. హైదరాబాద్‌లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol, Diesel Rates Today: ఇటీవల కాలం నుంచి వాహనదారులకు షాకిచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతుంటే తాజాగా మళ్లీ పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్లో ..

Petrol, Diesel Rates Today: భగ్గుమన్న క్రూడాయిల్‌.. హైదరాబాద్‌లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2022 | 10:25 AM

Petrol, Diesel Rates Today: ఇటీవల కాలం నుంచి వాహనదారులకు షాకిచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతుంటే తాజాగా మళ్లీ పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలను విడుదల చేశాయి. తాజాగా మే 13 (శుక్రవారం) హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 17 పైసలు పెరగడంతో ప్రస్తుతం రూ.119.49కి చేరుకుంది. అలాగే లీటర్‌ డీజిల్ ధర రూ.105.49 నుంచి రూ.105.65కు చేరుకుంది. నెల రోజులుగా వాహనదారులకు ఊరటనిస్తున్న ధరలు మళ్లీ షాకిచ్చినట్లయింది. మరో వైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ 109 డాలర్లుగా నమోదైంది. డబ్ల్యూటీఐ బ్యారల్‌కు 107.4 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా ఇక రేట్ల పెంపుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో ఎలాంటి మార్పు లేదు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.41 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే డీజిల్‌ ధర రూ.96.67 వద్ద ఉంది. ఇక చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.85 ఉండగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.94 ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.51 ఉండగా, డీజిల్‌ ధర రూ.104.77వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ ధర రూ.99.83 వద్ద కొనసాగుతోంది.

అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నా.. ఒక్క హైదరాబాద్‌లోనే ధరలు పెరిగాయి. ఇక ఏపీలోనూ ధరలు స్వల్పంగా పెరిగాయి. విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120 నుంచి రూ.120.30కి చేరగా, లీటరు డీజిల్ ధర రూ.105.65 నుంచి రూ.105.93కు పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు