శుభకార్యం ఏదైనా.. పండుగ ఏదొచ్చినా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మడుపరులకు ఊరటనిచ్చే వార్త ఇది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. సోమవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..
ఇది చదవండి: కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. ఇంతకీ అదేంటంటే.?
సోమవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 10 తగ్గి రూ. 77,660గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 71,190గా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,340గా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,810గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,660గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,190గా కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయ్. రెండు రోజుల క్రితం దాదాపుగా రూ. 2 వేలు పెరిగిన వెండి ధర.. ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం రూ. 100 మేరకు తగ్గి కేజీ రూ. 96,900 దగ్గర స్థిరపడింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,02,900గా కొనసాగుతోంది. అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 91,900గా ఉంది.
ఇది చదవండి: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. ఎంతకు అమ్ముడైందో తెల్సా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..