Gold Rate Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట..! హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు..

ఎప్పటి కప్పుడు పుత్తడి ధర దిగివస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, గోల్డ్‌ రేట్‌ మాత్రం త్వరలోనే లక్షను క్రాస్‌ చేసేందుకు చేరువైంది. ఇక గత వారం రోజులగా చూసుకుంటే బంగారం ధర భారీగా పెరుగుతోంది. అయితే, ఇవాళ పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్పించింది. ధరల పెరుగుదలకు చిన్న బ్రేక్ పడింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు..

Gold Rate Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట..! హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు..
Gold

Updated on: Apr 03, 2025 | 7:27 AM

భగ్గుమంటున్న బంగారం ధర సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. మిడిల్‌ క్లాస్‌ ప్రజలు గోల్డ్‌ని ఇకపై ఫోటోల్లో మాత్రమే చూసుకోవాలేమో అన్నట్టుగా బంగారం భయపెడుతోంది. ఎక్కడ తగ్గేది లేదంటూ గత కొన్ని సంవత్సరాలుగా పసిడి పరుగులు తీస్తూనే ఉంది.. ఎప్పటి కప్పుడు పుత్తడి ధర దిగివస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, గోల్డ్‌ రేట్‌ మాత్రం త్వరలోనే లక్షను క్రాస్‌ చేసేందుకు చేరువైంది. ఇక గత వారం రోజులగా చూసుకుంటే బంగారం ధర భారీగా పెరుగుతోంది. అయితే, ఇవాళ పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్పించింది. ధరల పెరుగుదలకు చిన్న బ్రేక్ పడింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి రూ. 92 వేల 830 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం ధర 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా రూ. 85 వేల 090 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలినట్టయితే…

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,980 వద్ద ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,830 వద్ద ఉంది. అటు,చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,830 వద్ద ఉంది.

ఇకపోతే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,830 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,850 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఐటీ రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,830 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,830 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,830 వద్ద ఉంది.

ఇవాళ్టి వెండి ధరలు..

బంగారంతో పాటు వెండి సైతం ఇవాళ కాస్త ఉపశమనం కల్పించింది. క్రితం రోజు రూ. 1000 మేర పెరిగి కొత్త గరిష్ఠాలను తాకిన వెండి రేటు ఇవాళ అదే రేటు కిలోకు రూ. 1,13,900 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

అయితే, పైన చెప్పిన బంగారం, వెండి ధరలు ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల లోపుగా అందిన సమాచారం మేరకు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.. అయితే, మధ్యాహ్నానికి బంగారం ధరలు మారవచ్చు. అలాగే జీఎస్టీతో పాటు స్థానిక పన్నులు కలిపితే ప్రాంతాలను బట్టి బంగారం రేట్లు వేరు వేరుగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందే పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..